కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మూడు స్థానాలకు పోటీ..

ప్రతీకాత్మక చిత్రం

MLC Elections: గెలిచిన ఎమ్మెల్సీలు 2022జనవరి 4 వరకు పదవిలో ఉండనున్నారు. కాగా, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజక వరాల్లో 2,799 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,086 మంది ఓటర్లుండగా.. వరంగల్‌లో 902, రంగారెడ్డిలో 811 మంది ఉన్నారు.

  • Share this:
కాసేపట్లో తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో ఎమ్మెల్సీ పోలింగ్‌ జరగనుంది. రంగారెడ్డి, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీగా ఉన్న పట్నం నరేందర్‌రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎమ్మెల్సీగా ఉన్న రాజగోపాల్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. అదేవిధంగా పార్టీ మారిన కారణంతో వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కొండా మురళీ రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఈ మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ మే7న నోటిఫికేషన్ జారీచేసింది. ఓట్ల లెక్కింపు జూన్ 3న జరుగుతుంది. గెలిచిన ఎమ్మెల్సీలు 2022జనవరి 4 వరకు పదవిలో ఉండనున్నారు. కాగా, మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజక వరాల్లో 2,799 మంది ఓటర్లున్నారు. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1,086 మంది ఓటర్లుండగా.. వరంగల్‌లో 902, రంగారెడ్డిలో 811 మంది ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలో 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. జడ్పీటీసీలు ఉమ్మడి జిల్లా జడ్పీ కార్యాలయాల్లో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎంపీటీసీ సభ్యుల కోసం ఐదారు మండలాలకు ఒక పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటుచేశారు.

బరిలో 9 మంది..
మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో 9 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానానికి మాజీమంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీలో ఉన్నారు. నల్లగొండ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా తేరా చిన్నపరెడ్డి, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. వరంగల్ నుంచి ఎక్కువ మంది పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఇనుగాల వెంకట్రాంరెడ్డి పోటీచేస్తుండగా.. మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు.
First published: