ఎందుకింతా ఘోరంగా ఓడిపోయాం?...ఇవాళ టీడీపీ ఉన్నత స్థాయి సమీక్షలో చర్చ

ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కు పడకుండా పవన్ కల్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం.. జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైసీపీకే మేలు చేసిందనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తమవుతుంది.

news18-telugu
Updated: June 14, 2019, 8:56 AM IST
ఎందుకింతా ఘోరంగా ఓడిపోయాం?...ఇవాళ టీడీపీ ఉన్నత స్థాయి సమీక్షలో చర్చ
టీడీఎల్పీ సమావేశం
  • Share this:
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలపై చంద్రబాబు అధ్యక్షతన తెదేపా ఉన్నత స్థాయి సమీక్ష ఇవాళ జరగనుంది. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో తెదేపా శ్రేణులపై జరుగుతున్న దాడులను ఈ సమావేశంలో చంద్రబాబు..నేతలతో చర్చించనున్నారు. భవిష్యత్తు ప్రణాళికపై పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేయనున్నారు. విజయవాడ ఏ కన్వెన్షన్ వేదికగా తెలుగుదేశం పార్టీ...ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో పాటు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో టీడీపీ కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను జిల్లాల వారీగా సేకరించనున్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉండేందుకు ఓ టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పార్టీ ఏర్పాటు చేసింది.

దాడులను ఎలా ఎదుర్కొవాలనే అంశంపై అధినేత చంద్రబాబు కార్యచరణ రూపొందించనున్నారు. నియోజకవర్గంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసే వ్యవస్థను శ్రేణులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో విశ్లేషించనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఓటమి లేని స్థానాలు, నియోజకవర్గం ఏర్పడి నాటి నుంచి విజయాలు నమోదు చేసిన సీట్లలలో ఈసారి ఓటమి పాలవ్వడంపై వాస్తవాలు ఏంటి అనే కోణంలో అధ్యయనం చేయనున్నారు. జన్మభూమి కమిటీల వ్యవహారం, అభివృద్ధి, సంక్షేమాన్ని కార్యక్రమాల పేరిట ప్రభుత్వం అందించిన లబ్ధిని జన్మభూమి కమిటీల తీరు దెబ్బతీశాయా..? తీస్తే 150 స్థానాల్లో ఆ ప్రభావం పడిందా ? అనే చర్చ సమావేశంలో జరగనుంది.

ప్రభుత్వ వ్యతిరేక ఓటు జగన్‌కు పడకుండా పవన్ కల్యాణ్ చీలుస్తాడనుకున్నది విఫలమవటం..జనసేన పోటీ తెలుగుదేశం కంటే వైసీపీకే మేలు చేసిందనే అభిప్రాయం నేతలు నుంచి వ్యక్తమవుతుంది. కానీ ...అది ఎన్ని స్థానాలకు పరిమితమైందో చర్చించనున్నారు.  పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలు... గత అయిదేళ్లలో కాపు సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యం ఇవ్వటం వల్ల పార్టీకి దూరంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పార్టీకి అండగా నిలిచే కొన్ని సామాజిక వర్గాలను పొగొట్టుకున్నామనే భావన నేతల్లో ఉంది. వీటిపై సమీక్షలో సమగ్ర విశ్లేషణ జరగనుంది. పార్టీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించిన చంద్రబాబు...ఆ దిశగా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: June 14, 2019, 8:55 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading