TODAY CBI COURT VERDICT ON ANDHRA PRADESH CM JAGAN BAIL CANCEL PETITION NGS
Jagan CBI Court Verdict: నేడు సీబీఐ కోర్టు కీలక తీర్పు.. జగన్ బెయిల్ రద్దు..! తప్పదంటున్న రఘురామ
ఏపీ సీఎం వైఎస్ జగన్ (ఫైల్)
సీఎం జగన్ బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా..? ఇవాళ ఏం జరగబోతోంది..? సీబీఐ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది. ప్రస్తుతం ఇదే అంశం రెండు రాష్ట్రాల్లోని హాట్ టాపిక్ గా మారింది.
Jagan CBI Court Verdict: ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (Andhra pradesh CM Jagan)బెయిల్ రద్దవుతుందా..? కొనసాగుతుందా..? ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ విచారణపై రోజు రోజుకూ ఉత్కంఠ పెరుగుతోంది. సీబీఐ కోర్టు (CBI Court) దీనిపై ఏం చెబుతుందని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పిటిషనర్ వాధనతో ఏకిభవించి బెయిల్ రద్దు చేస్తే ఏపీలో పరిస్థితి ఏంటి. రాజకీయంగా ఎలాంటి పరిణామాలు ఉంటాయి. ఇలా ఎన్నో ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో బెయిర్ రద్దు సాధ్యం కాదని కొందరు అంటున్నారు. మరి ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ప్రస్తుతం జగన్ బెయిల్ రద్దు అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరి సీబీఐ కోర్టు ఇవాళ ఏం చెప్పబోతోంది. ఇప్పటికే ఇరు వర్గాలు వాదనలు ముగియడంతో దీనిపై తీర్పు వస్తుందని అతా భావిస్తున్నారు. అయితే పిటిషన్ వేసీన ఎంపీ రఘురామ మాత్రం కచ్చితంగా బెయిల్ రద్దవుతుందని మరోసారి స్పష్టం చేశారు. ఇటు వైసీపీ నేతలు, కేడర్ లోనూ నేటి తీర్పు ఎలా ఉంటుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సీఎం జగన్ బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నందున బెయిల్ రద్దు చేసి.. ఆయనపై ఉన్న కేసులను శరవేగంగా విచారించాలని రఘురామకృష్ణరాజు ఏప్రిల్ మొదటి వారంలో పిటిషన్ దాఖలు చేశారు. రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్లో కీలకమైన అంశాలను వివరించారు. సీఎం హోదాలో ఆయన వివిధ కారణాలు చెబుతూ కోర్టుకు హాజరు కాకుండా డుమ్మా కొడుతున్నారని అధికారాన్ని ఉపయోగించి. అందరి నోళ్లు నొక్కేలా వ్యవహరిస్తున్నారని తప్పుడు కేసులు పెడుతున్నారని ఇలా ఇతర అంశాలను వివరించారు. అయితే ఎంపీ వ్యక్తిగత కక్షతోనే పిటిషన్ వేశారని జగన్ కౌంటర్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై సీబీఐ కౌంటర్ వేయడానికి నిరాకరించింది. మెరిట్ ప్రకారం నిర్ణయం తీసుకోండి అని సీబీఐ కోర్టుకే చాయిస్ వదిలేసింది. సీఎం జగన్, పిటిషనర్ తరపు న్యాయవాదులు రిజాయిండర్ వేసినప్పటికీ సీబీఐ అధికారులు మాత్రం కేవలం కోర్టుకు విచక్షణ అధికారానికే వదిలేస్తున్నామని తెలిపారు. బెయిల్ రద్దు చేయాలా వద్దా అనే అంశానికి సంబంధించి న్యాయపరమైన చర్యలు కోర్టే తీసుకోవాలని రిజాయిండర్లో పేర్కొన్నారు. దీంతో జగన్, రఘురామ తరపు న్యాయవాదులు మాత్రమే వాదనలు వినిపించారు.
కేవలం జగన్ బెయిల్ రద్దు అంశమే కాదు.. అదే పార్టీకి చెందిప ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై కూడా ఇవాళే విచారణ కొనసాగనుంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కూడా లిఖితపూర్వకమైన కౌంటర్ దాఖలు చేశారు. కోర్టే నిర్ణయం తీసుకోవాలని సీబీఐ చెప్పింది. ఎంపీ పదవిని అడ్డం పెట్టుకుని విజయసాయిరెడ్డి సాక్షుల్ని బెదిరిస్తున్నారని... బెయిల్పై ఉండి న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే రఘురామ పబ్లిసిటీ కోసమే పిటిషన్ వేశారని.. ఆయనపై అనేక కేసులు ఉన్నాయని విజయసాయిరెడ్డి కౌంటర్లో పేర్కొన్నారు.
సీబీఐ కోర్టు తీర్పు సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుతం రాజకీయంగా బెయిల్ అంశం దుమారం రేపుతోంది. ఇటీవల బీజేపీ నేతలు సైతం దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఉన్న రాజకీయ పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తోంది అంటూ మంత్రులు వ్యాఖ్యనించడంతో.. బీజేపీ అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చింది. జగన్ ప్రభుత్వాన్ని కూలదీసే అవసరం తమకు లేదని.. ఆయన బెయిల్ రద్దు అయ్యి జైలుకు వెళ్లడం ఖాయమంటూ వ్యాఖ్యలు చేశారు. ఎంపీ రఘురామ, బీజేపీ నేతలు సైతం పదే పదే జగన్ బెయిల్ రద్దు అవుతుందని చెబుతుండడంతో ఈ అంశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గత కొంతకాలంగి విమర్శలకు సమాధానం ఇవ్వకుండా తన పని తాను చేసుకుపోతున్నారు సీఎం జగన్.. కానీ తాజాగా బెయిల్ పిటిషన్ పై ఆయన స్పందించారు. దీంతో ఏదో జరగబోతోందని వైసీపీ శ్రేణుల్లో సైతం అందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో నేడు ఏం జరుగుతుంది అన్నది తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆసక్తి పెంచుతోంది..
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.