ఇవాళ కర్నూలు జిల్లాకు చంద్రబాబు... నిరసన సెగలు తప్పవా ?

హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రమే అడుగు పెట్టనిస్తామని విద్యార్థి జేఏసీ చెబుతోంది.

news18-telugu
Updated: December 2, 2019, 7:41 AM IST
ఇవాళ కర్నూలు జిల్లాకు చంద్రబాబు... నిరసన సెగలు తప్పవా ?
చంద్రబాబు(ఫైల్ ఫోటో)
  • Share this:
తాజాగా రాజధాని అమరావతిలో పర్యటించిన చంద్రబాబు... ఇవాల్టి నుంచి సీమ పర్యటనకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఆయన కర్నూలు జిల్లాకు బయల్దేరి వెళ్లనున్నారు. యితే ఇక్కడ కూడా చంద్రబాబుకు నిరసన సెగలు తప్పేలా లేవు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటించాలనుకుంటున్నారు. అయితే బాబు టూర్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకున్న రాయలసీమ విద్యార్థి జేఏసీ నిరసనలకు దిగంది. కర్నూలులో టీడీపీ ఆఫీస్ ఎదుట జేఏసీ ఆందోళన నిర్వహించింది. రాయలసీమ ప్రాంతం ప్రయోజనాల కోసం తెలుగుదేశం ప్రభుత్వం పని చేయలేదని విద్యార్థి సంఘాల జేఏసీ ఆరోపిస్తోంది.

హైకోర్టును లేదా రాజధానిని రాయలసీమకు మార్చడానికి చంద్రబాబు అనుకూలంగా ప్రకటన చేస్తే మాత్రమే చంద్రబాబు కర్నూలు జిల్లాలో చంద్రబాబును అడుగు పెట్టనిస్తామని విద్యార్థి సంఘాల జేఏసీ చెబుతోంది. దీంతో చంద్రబాబు పర్యటనలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయోనన్న భయం అటు టీడీపీలో వ్యక్తమవుతోంది. ఇటు పోలీసులు, అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది.
Published by: Sulthana Begum Shaik
First published: December 2, 2019, 7:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading