ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్... కీలక బిల్లులకు ఆమోదం

ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఒక విడత డీఏ చెల్లింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

news18-telugu
Updated: December 11, 2019, 8:32 AM IST
ఇవాళ మధ్యాహ్నం ఏపీ కేబినెట్... కీలక బిల్లులకు ఆమోదం
ఏపీ కేబినెట్ సమావేశం (File)
  • Share this:
ఇవాళసాయంత్రం మూడు గంటలకు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ భేటీ కానుంది. సభలో ప్రవేశ పెట్టె బిల్లులకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళల భద్రత కోసం రూపొందించిన డ్రాఫ్ట్ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్ లు ఏర్పాటు చేసే బిల్లుకు ఆమోదముద్ర వేయనుంది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయి ఉన్న ఒక విడత డీఏ చెల్లింపునకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. క్యాబినెట్ భేటీ తర్వాత అసెంబ్లీ లో అనుసరించాల్సిన వ్యూహంపై  సీఎం జగన్ మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు అసెంబ్లీ సమావేశాలు మూడో రోజుకు చేరాయి. ప్రభుత్వంలో సలహాదారులు నియామకం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన, రాయలసీమ జిల్లాల జలాశయాలు నింపకపోవడంపై టీడీపీ ప్రశ్నలు సిద్ధం చేస్తుంది. వైఎస్సార్ ఆసరా పథకం, ఎల్ ఈడీ బల్బుల సరఫరా పై వైసీపీ ప్రశ్నలు రెడీ చేసింది. అసెంబ్లీలో గ్రామ సచివాలయలు, గ్రామ వాలంటీర్లు, ఉద్యోగాల కల్పనపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అమరావతిలో హ్యాపీ నెస్ట్ ప్లాట్ ల పై శాసన మండలి లో టీడీపీ ప్రశ్నలు వేయనుంది. ఉల్లిధరల పెరుగుదల, రాష్ట్రంలో శాంతిభద్రతలు, అమరావతి నిర్మాణంపై శాసనమండలిలో ఇవాళ స్వల్పకాలిక చర్చ జరగనుంది.
First published: December 11, 2019, 8:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading