మరికాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ.. ఇసుక కొరతపై కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్

సీఎం జగన్

ఇసుక కొరత, అక్రమ రవాణా, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11.30కి కేబినెట్ సమావేశం ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు.

  • Share this:
    ఇసుక కొరత, అక్రమ రవాణా, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై కీలక నిర్ణయం తీసుకునేందుకు సీఎం జగన్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇవాళ ఉదయం 11.30కి కేబినెట్ సమావేశం ఏర్పాటు కానున్నట్లు ప్రభుత్వ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ సమావేశంలో ఇసుక అక్రమార్కులకు చెక్ పెట్టే చర్యలకు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. ఇక, అవినీతి అధికారులపై ఏసీబీ దాడులకు సంబంధించి ప్రణాళికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మరోవైపు.. నాడు-నేడు పథక అమలుకు కూడా ఆమోదం తెలపనున్నారు. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ఇసుక కొరత తీసుకొనేవరకు అధికారులెవరూ సెలువులు తీసుకోవద్దని సీఎం జగన్ అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

    నవంబర్ 14 నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాలు నిర్వహిస్తామని సీఎం అన్నారు. ఎవరైన ఎక్కువ రేటుకు ఇసుక అమ్మితే వారికి రెండేళ్ల జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం రోజువారి ఇసుక లభ్యత పెరిగిందన్నారు.
    Published by:Shravan Kumar Bommakanti
    First published: