news18-telugu
Updated: January 22, 2020, 8:15 AM IST
గుంటూరు జిల్లాలో రైతుల పాదయాత్ర
గుంటూరు జిల్లా వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు అమరావతి జేఏసీ నేతలు. మూడు రాజధానులు వద్దు అమరావతియే ముద్దు అంటూ నినిదాలు చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. విద్యార్తుల భవిష్యత్తును జగన్ నాశనం చేస్తున్నారన్నారు. అయితే అమరావతి JAC తలపెట్టిన బంద్ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు లేవంటున్నారు పోలీసులు. గుంటూరు రూరల్ పరిధుల్లో విద్యార్ధులకు, ఉద్యోగులకు, సాధారణ ప్రజలకు బంద్ కారణంగా ఇబ్బందులు కలుగుతాయని చెబుతున్నారు. ఎవరూ ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు నిర్వహించరాదని, బలవంతంగా షాపులు, విద్యాసంస్థలు మూయించడం చేయరాదని పోలీసులు ప్రకటించారు.
బంద్ సందర్భంగా, సంఘ విద్రోహ శక్తులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న సంఘవిద్రోహ శక్తులు ప్రభుత్వ ప్రైవేటు ఆస్తులను నష్టం కలగించేందుకు కూడా అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు పోలీస్ అధికారులు. అందుకే బంద్ కార్యక్రమాలలో ప్రజలు ఎవరూ పాల్గొనకూడదన్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా... వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
January 22, 2020, 8:15 AM IST