TODAY AGRIGOLD VICTIMS PROTEST RALLY AGAINST HAAILAND
నేడు అగ్రిగోల్డ్ బాధితుల ‘ఛలో హాయ్ ల్యాండ్’
అగ్రిగోల్డ్ లోగో
రెండు బృందాలుగా విడిపోయి అగ్రిగోల్డ్ బాధితులు ముట్టడి కార్యక్రమానికి బయల్దేరనున్నారు. చినకాకాని నుంచి ‘ఛలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరనుంది. విజయవాడ కనకదుర్గ వారధి వైపు ఒక బృందం, మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుంది.
అగ్రిగోల్డ్ బాధితులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. గత కొన్ని నెలలుగా తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్న వారు.. తాజాగా చలో హాయ్ ల్యాండ్ ట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్ ల్యాండ్ తమది కాదని తాజాగా కోర్టుకు తెలిపింది. అనంతరం నిరసనలు రావడంతో వెంటనే హాయ్ ల్యాండ్ తమదేనంటూ హడావుడి ప్రకటన చేసింది. అయినా సరే తమ ఆందోళన యధావిధిగా నిర్వహిస్తామంటున్నారు అగ్రిగోల్డ్ బాధితులు. కోర్టు సీరియస్ అయినందునే... యాజమానం మాట మార్చిందని ఆరోపిస్తున్నారు.
రెండు బృందాలుగా విడిపోయి అగ్రిగోల్డ్ బాధితులు ముట్టడి కార్యక్రమానికి బయల్దేరనున్నారు. చినకాకాని నుంచి ‘ఛలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరనుంది. విజయవాడ కనకదుర్గ వారధి వైపు ఒక బృందం, మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుంది. ఛలో హాయ్ ల్యాండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలంటూ అగ్రిగోల్డ్ వినియోగాదారులు, ఏజెంట్లు.. పోలీసులు కలిశారు. అనుమతి లేదంటూ ముట్టడి కార్యక్రమాన్ని అణచివేస్తే తర్వాత జరిగే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాము చేపట్టే ఈ కార్యక్రమన్ని అడ్డుకోవద్దని .. శాంతియుతంగా చేపడుతున్న ఈ నిరసన కార్యక్రమానికి పోలీసు బందోబస్త్ అవసరం లేదని ప్రభుత్వానికి విన్నవించారు.
మరోవైపు ఛలో హాయ్ ల్యాండ్ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లకు దిగారు. పలువురు నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు, నెల్లూరు,ప్రకాశం జిల్లాలో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు హాయ్ ల్యాండ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేశారు.
Published by:Sulthana Begum Shaik
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.