• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TO JOIN OR NOT TO JOIN IN BJP TELANGANA CONGRESS LEADER DAMODAR RAJA NARASIMHA IS IN DILEMMA BA MDK

Telangana: భార్య ఒత్తిడి.. డైలమాలో కాంగ్రెస్ సీనియర్ నేత.. బీజేపీలో చేరతారా?

Telangana: భార్య ఒత్తిడి.. డైలమాలో కాంగ్రెస్ సీనియర్ నేత.. బీజేపీలో చేరతారా?

ప్రతీకాత్మక చిత్రం

కాంగ్రెస్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో చేరుతారని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

  • Share this:
     (కె. వీరన్న, మెదక్ జిల్లా కరస్పాండెంట్, న్యూస్ 18)

    కాంగ్రెస్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గత కొన్ని రోజుల నుంచి బీజేపీలో చేరుతారని కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని కూతురు శృతి హాసిని బీజేపీలోకి చేరాలని దామోదర్ పై ఒత్తిడి తెస్తున్నట్లు కార్యకర్తలలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడ్డారు దామోదర రాజనర్సింహ సతీమణి పద్మిని. అప్పట్లో సంగారెడ్డి నియోజక వర్గం నుంచి జగ్గారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆమె అసంతృప్తికి లోనయ్యారు. బీజేపీలో చేరారు. అనంతరం మళ్లీ సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. పద్మిని రాజకీయాల్లోకి రావాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె ఎమ్మెల్యే అవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. అందుకే, దామోదర రాజనర్సింహ మీద ఒత్తిడి చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

    దామోదర్ రాజనర్సింహ సతీమణి పద్మిని పూజలు ఎక్కువగా చేస్తారనే పేరుంది. ఆధ్యాత్మిక భావాలు కూడా ఎక్కువ. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరేందుకు మొగ్గుచూపుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాషాయ నేతలు కూడా ఆమెను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ పెద్దల సమక్షంలో బీజేపీ కండువా కప్పుతామని చెప్పినట్టు తెలిసింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆధ్వర్యంలో పద్మిని బీజేపీలో చేరారు. అప్పుడు అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ ప్రచారంలో ఉన్నారు దామోదర రాజనర్సింహ. తన భార్య పద్మిని బీజేపీలో చేరిందని తెలిసి షాక్ తిన్న దామోదర వెంటనే ఫోన్ చేసి భార్యకు నచ్చజెప్పారు. అదే రోజు సాయంత్రంలోగా ఆమె మళ్లీ కాంగ్రెస్ లోకి చేరారు.

    కాంగ్రెస్ పార్టీ తరపున ఆందోల్ నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు పోటీ చేశాు. ఐదు సార్లు ఓటమి చెందారు. మూడు సార్లు గెలిచారు. డిప్యూటీ సీఎం స్థాయి వరకు ఎదిగారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో సన్నిహిత  సంబంధాలు ఉండేవి. దామోదర రాజనరసింహకు ఢిల్లీ స్థాయి వరకు కాంగ్రెస్లో మంచి పేరుంది. తన తండ్రితో పాటు కాంగ్రెస్ లో వచ్చిన దామోదర రాజనర్సింహ కాంగ్రెస్ లోనే ఉంటారా? లేదా తన ఫ్యామిలీ మాట వింటారా అనే అంశం పై వేచి చూడాల్సిందే.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు