Third Front: మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి.. కేసీఆర్, జగన్ దారి ఎటు..? చంద్రబాబు పరిస్థితి?

మోదీకి వ్యతిరేకంగా మూడో కూటమి

జాతీయ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇవాళ శరద్ పవర్ ఇంటి దగ్గర కీలక సమావేశం జరనుంది. మూడో ఫ్రంట్ ఏర్పాటుపై చర్చిస్తారా..? మరి ఈ కూటమి వెంట నడిచే పార్టీలు ఏవి. తెలుగు రాష్ట్రాల సీఎం ల దారి ఎటు.

 • Share this:
  జాతీయ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సరికొత్త ప్లాన్ తో ముందుకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. రాజకీయ వ్యూహకర్త పదవికి దూరంగా ఉంటానని చెప్పిన ఆయన.. ప్రస్తుతం కేంద్రంలో మోదీ టీంకు పోటీ ఇచ్చేందుకు తెరపైకి మూడో కూటమిని తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. శరద్ పవార్ తో వరుస భేటీలు అదే సంకేతమిస్తోంది. మరోవైపు ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయిన తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మరో కీలక అడుగు వేశారు. మోదీకి వ్యతిరేకంగా జట్టు కట్టడానికి ముందకు వచ్చే విపక్ష నేతలతో పవార్ ఓ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పలు పార్టీలకు ఇప్పటికే పవార్ పక్షాన ఆహ్వానాలు కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్‌కు మాత్రం పవార్ బృందం ఈ ఆహ్వానాన్ని పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది. శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఇద్దరూ ఈ భేటీకి అధ్యక్షత వహిస్తారు. చర్చను ముందుకు తీసుకెళ్తారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది..

  కొద్ది రోజుల క్రితం ముంబైలో శరద్‌ పవార్‌ను కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ సోమవారం మరోసారి ఢిల్లీలో కలవడంతో ఎదో జరుగుతోందనే చర్చ మొదలైంది. ఆ వెంటనే పవార్‌ తన కార్యాచరణ ముమ్మరం చేశారు. ఇవాళ జరగబోయేది ప్రాథమిక సమావేశమేనని, ఇందులో భవిష్యత్తు కార్యాచరణకు తగిన రూపకల్పన జరుగుతుందని ఎన్సీపీ నేతలు అంటున్నారు. ముఖ్యంగా 2024 నాటికి మూడో ఫ్రంట్‌ను సిద్దం చేయడమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్న ఈ సమావేశంలో ప్రస్తుత దేశ రాజకీయ, ఆర్థిక పరిస్థితులను ప్రధానంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.

  ఇదీ చదవండి: జిమ్ జిమ్ జిగా జిగా.. బాబోయ్ 83 ఏళ్ల వయసులో ఈ ఫీట్ల.

  అయితే జాతీయ స్థాయిలో ఏర్పడుతున్న ఈ మూడో ఫ్రంట్ కు ఇప్పటికే తెరవెనుక ప్రయత్నాలు మొదలయ్యాయని సమాచారం. ముఖ్యంగా పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో దీనిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. వివిధ పార్టీల నేతలను ఏకం చేసే బాధ్యతను ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ తీసుకున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఆయన తన నివాసంలో ఆయా పార్టీల నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారు. ఈ సమావేశానికి రావాల్సిందిగా దాదాపు 15 పార్టీల నేతలను, మేధావులు, కళాకారులను పవార్‌ ఆహ్వానించారు.

  ప్రస్తుతం ఈ సమావేశంలో సంజయ్‌సింగ్‌, పవన్‌ వర్మతో పాటు ఎన్సీపీ ఎంపీ వందనా చవాన్‌, జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్‌ అబ్దుల్లా, సీపీఐ నేత డి.రాజా, సమాజ్‌వాది పార్టీ నేత ఘన్‌శ్యామ్‌ తివారీ, ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి తదితరులు పాల్గొననున్నారు. వీరితోపాటు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ ఎస్‌ వై ఖురేషి, ప్రముఖ కవి జావెద్‌ అఖ్తర్‌, మాజీ న్యాయమూర్తి ఏపీ సింగ్‌, ఇరాన్‌ మాజీ రాయబారి కేసీ సింగ్‌, జర్నలిస్టులు కరణ్‌ థాపర్‌, అశుతోష్‌, ప్రీతిష్‌ నంది, కాంగ్రెస్‌ మాజీ అధికార ప్రతినిధి సంజయ్‌ ఝా, కాలమిస్టు సుదీంధ్ర కులకర్ణి తదితరులు పాల్గొంటారని తెలుస్తోంది.

  ఇదీ చదవండి: అమ్మ బ్రహ్మ దేవుడో... ఆ పని చేస్తూ ఇంత అందమా..?

  మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు, టీడీపీ అధినేత చంద్రబాబు ఏ కూటమిలో ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మూడో కూటమిలో చేరుతారనే ప్రచారం చాలా రోజుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే ఆయన బీజేపీ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఇటు రాష్ట్రంలో.. అటు కేంద్ర స్థాయిలోనూ బీజేపీ తీరుపై సీఎం కేసీఆర్ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనను త్వరలోనే ప్రశాంత్ కిషోర్ కలుస్తారంటూ ప్రచారం ఉంది. కేసీఆర్-ప్రశాంత్ కిషోర్ భేటీ తరువాత ఆయన మూడో కూటమిలో ఉంటారా? ఉండరా అన్నదానిపై క్లారిటీ రావొచ్చు..

  ఇదీ చదవండి: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఆర్టీఏ గుడ్ న్యూస్... జూలై 1 నుంచి..

  ఇక ఆంధప్రదేశ్ విషయానికి వస్తే.. సీఎం జగన్ నేరుగా ఏ కూటమిలో చేరే అవకాశం కనిపించడం లేదు. ఆయన్ను థర్డ్ కూటమిలోకి పిలిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఎందుకుంటే సీఎం జగన్ మోదీకి అన్ని విషయాల్లో బహిరంగంగానే మద్దతు ఇస్తున్నారు. అంతేకాదు కరోనా సమయంలో మోదీకీ మద్దతుగా నిలవాలని అందర్నీ ఏకతాటిపైకీ తెచ్చే ప్రయత్నం కూడా చేశారు. దీంతో జగన్ ను మూడో కూటమి నేతలు పట్టించుకునే అవకాశం లేదు. అయితే ఆయన నేరుగా ఎన్డీఏలో చేరే అవకాశాలు తక్కువే.. అదే జరిగితే తనకు బలమైన ఓట్ బ్యాంక్ ఉన్న మైనార్టీలను దూరం చేసుకోవాలని జగన్ వెనుకడుగు వేస్తున్నారనే ప్రచారం ఉంది.

  ఇదీ చదవండి:ఈ-కామర్స్‌ ఫ్లాష్‌ సేల్స్‌పై నిషేధం! మీ అభిప్రాయాలు చెప్పొచ్చు..ఏం చేయాలంటే

  ఇక చంద్రబాబు విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో ఘోర ఓమటి తరువాత జాతీయ స్థాయిలోనూ ఆయన్ను పెద్దగా పట్టించుకోవడం లేదు. మళ్లీ బీజేపీకి చేరువ అవ్వాలని ప్రయత్నిస్తున్నా ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదనే టాక్ వినిపిస్తోంది. సో ఆయనకు ఉన్ప మార్గం థర్డ్ ఫ్రంట్ లో చేరడమే.. సాధారణంగా రాష్ట్రంలో చంద్రబాబు పటిష్టంగా ఉంటే.. ఈ కూటమి ఆయనే నాయకత్వం వహించేవారేమో.. కానీ ఇప్పుడు ఇతరుల పిలుపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది..
  Published by:Nagesh Paina
  First published: