Home /News /politics /

TO DAY CONGRESS KEY MEETING SONIA AND RAHUL ALERT TO RUMORS ON THIRD FRONT NEWS NGS

Congress Meet: నేడు కాంగ్రెస్ కీలక సమావేశం.. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు వార్తల నేపథ్యంలో అలర్ట్.. టీపీసీసీ చీఫ్ ఎవరన్నది తేల్చేస్తారా..?

సోనియా, రాహుల్ గాంధీ

సోనియా, రాహుల్ గాంధీ

వరుస ఓటములతో ఢీలా పడ్డ కాంగ్రెస్ కు షాక్ లపై షాక్ లు తప్పడం లేదు. పలు రాష్ట్రాల్లో కీలక నేతలంతా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ మిత్ర పక్షాలు సైతం థర్డ్ ఫ్రంట్ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ప్రక్షాళనపై నేడు కాంగ్రెస్ నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.

ఇంకా చదవండి ...
  ప్రస్తుతం దేశ రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఇంతకాలం కేంద్రంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ కాంగ్రెస్ కు దగ్గరగా ఉంటూ వచ్చాయి. ఏ కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ తో కలిసే పాల్గొనేవి.. కానీ ఇప్పుడు పరిస్థితిలో పూర్తిగా మార్పు కనిపిస్తోంది. ఇటీవల ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. తాజాగా బీజేపీని ఢీ కొట్టేందుకు కొత్తగా ఫ్రంట్ ఏర్పాటు అవుతోందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషర్ తెర వెనుక ఉండి.. శరద్ పవార్ ను తెరపైకి తెచ్చి పావులు కదుపుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పలుమార్లు వరుసగా పవార్ తో భేటీ అవుతున్నారు. బయటు థర్డ్ ఫ్రంట్ అంటూ ఏది లేదని చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏదో జరుగుతోందన్నది బహిరంగ రహస్యమే.. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని ఈ ఫ్రంట్ కు నేతగా చేస్తారనే ప్రచారం కూడా ఉంది. పలు రాష్ట్రాల్లో ఇంత కాలం కాంగ్రెస్ కు మద్దతుగా నిలుస్తూ వచ్చిన ప్రాంతీయ పార్టీలు అన్నీ ఈ కొత్త ఫ్రంట్ వైపు మొగ్గుచూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఎవరూ కాంగ్రెస్ ను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయ్యింది.

  దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు, ఇతర అంశాలపై చర్చించి అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరుగనుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌లతో పాటు, పీసీసీ అధ్యక్షులు వర్చువల్‌గా జరిగే ఈ సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు.

  ఇదీ చదవండి: సింగర్ మంగ్లీని ఈ లుక్కులో ఎప్పుడైనా చూశారా..? బిగ్ బాస్ ఎంట్రీ కోసమేనా!

  ప్రస్తుతం కరోనా కారణంగా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు, ద్రవ్యోల్బణం, దేశ ఆర్థిక పరిస్థితి, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో పాటు కరోనా థర్డ్‌ వేవ్‌ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు. అలాగే కరోనా సెకండ్‌ వేవ్‌ సమయంలో ప్రజలకు అంబులెన్సులు, ఔషధాలు, ఆక్సిజన్, హాస్పిటల్‌ బెడ్స్‌ను అందించే విషయంలో సహాయపడేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన కోవిడ్‌–19 ఔట్‌రీచ్‌ కార్యక్రమం గురించి కూడా ఈ సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. వీటితో పాటు దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైన నిరసన తెలపాలనే ప్రణాళికను రూపొందించేందుకు సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

  ఇదీ చదవండి: ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మ.. అదంతా కట్టుకథేనా..? దాని కోసం అంత పని చేశారా..?

  మరోవైపు ఈ సమావేశం తరువాత టీపీసీసీ ఎంపీకపైనా ప్రకటన చేసే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో తెలంగాణలో కాంగ్రెస్ కు తీరని నష్టం జరుగుతోంది. ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని అధినేత్రి సోనియా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎవరన్న ఉత్కంఠకు కూడా ఇవాళే తెరదించే అవకాశం ఉంది..
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Congress, Rahul Gandhi, Sonia Gandhi, TS Congress

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు