TO DAY ANDHRA PRADESH CM JAGAN MOHAN REDDY DEPOSITED TO MONEY FOR AGRI GOLD VICTIMS BELOW 20 THOUSAND RS NGS
Andhra Pradesh: ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్.. నేడు వారి ఖాతాలోకి డబ్బులు.. నగదు రాకపోతే ఇలా చేయండి
Agri Gold: అగ్రిగోల్డ్ లోగో
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షేమ పథకాలు అమలు చేయడం చాలా కష్టం. కేంద్రం నిధులు ఇవ్వడం లేదు. బయట అప్పులు పుట్టడం లేదు. ఇలాంటి సమయంలోనూ ఇచ్చిన మాట కోసం మరోసారి నగదు జమ చేయనున్నారు సీఎం జగన్..
Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ చేతికి అడ్డు లేదని నిరూపించుకుంటున్నారు. ఓ వైపు కొత్తకొత్త సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. పాత వాటిని కొనసాగిస్తూ ప్రతి ఏడాది నగదు జమ చేస్తూనే ఉన్నారు. కరోనా కష్టకాలంలోనూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో జగన్ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల ఖాతాల్లో నగదు వేయనున్నారు. ఇవాళ ఏపీ ప్రభుత్వం.. అగ్రీగోల్డ్ బాధితులకు డబ్బులు జమ చేయనుంది. 10 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారికి 207.16 కోట్లు జమ చేయనున్నారు. 20 వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన వారి ఖాతాల్లో 459.23 కోట్లు కలిపి మొత్తం 7 లక్షల మందికి పైగా అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేయనుంది. ఈ మేరకు మొత్తంగా 666.84 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 19 వరకూ 7.76 లక్షల మంది డిపాజిట్‌దారులు దరఖాస్తు చేసుకున్నారు. 10 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఇప్పటికే 240 కోట్లను ప్రభుత్వం చెల్లించింది. 67 ఎకరాల అగ్రిగోల్డ్ స్థలాన్ని కోర్టుకు స్వాధీనం చేసింది. పాదయాత్ర సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాటకు కట్టుబడి బాధితుల ఖాతాల్లో నగదు జమ చేస్తూ సీఎం జగన్ ఆదుకుంటున్నారని వైసీపీ నేతలు చెప్పారు.
ఓ ప్రైవేటు సంస్థ మూసేస్తే బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసిన దాఖలాలు ఎక్కడ లేవని.. అది కూడా ప్రతిపక్ష నేత.. గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... హయాంలోనూ ఈ సంస్థకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. ఆయన హయాంలోనే సంస్థ మూతపడిందని.. బాధితులకు అందాల్సిన నగదు అందడకుండా.. అగ్రీగోల్డ్ ఆస్తులను చంద్రబాబు బినామీలే లాక్కున్నారంటూ వైసీపీ నేతలు పదే పదే విమర్శిస్తున్నారు.. చంద్రబాబు చేసిన తప్పులకు కూడా జగన్ న్యాయం చేస్తున్నారని వైసీపీ నేతలు చెబుతూ వస్తున్నారు.
ప్రస్తుత సీఎం జగన్.. తాను అధికారంలోకి రాక ముందు పాదయాత్ర చేస్తున్న సమయంలో అగ్రీ గోల్డ్ బాధితుల బాధ విన్నారు. ఆత్మహత్యలకు సిద్ధపడ్డ వారికి ధైర్యం చెప్పారు. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని సీఎం జగన్ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు చేశారు. ప్రభుత్వం నగదు జమ చేసిన తరువాత ఎవరికైనా.. నగదు రాకపోతే నేరుగా సచివాలయానికి వెళ్లి సంప్రదించవచ్చని.. లేదా వాలంటీరుకు చెప్పినా సరిపోతుందని.. అయినా సమస్య తీరకపోతే బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Published by:Nagesh Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.