చిల్లర డబ్బులు పోగేశాడు నామినేషన్ వేశాడు.. ఓ అభ్యర్థి కథ

మొత్తం రూ. 10, రూ.5, రూ.2, రూ.1 నాణాలతోనే మొత్తం రూ.25వేల చెల్లించారు. సౌత్ చెన్నై జోనల్ ఆఫీస్‌కు చేరుకున్న ఆయన మొత్తం 13 పాత్రాల్లో చిల్లరను తీసుకొచ్చి డిపాజిట్ చెల్లించాడు.

news18-telugu
Updated: March 29, 2019, 5:47 PM IST
చిల్లర డబ్బులు పోగేశాడు నామినేషన్ వేశాడు..  ఓ అభ్యర్థి కథ
చిల్లర డబ్బులతో నామినేషన్
  • Share this:
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నడుస్తోంది. దీంతో నేతలు ఓటర్లను ఆకట్టుకునేందుకు నాయకులు కొత్త కొత్త స్టంట్లు చేస్తున్నారు. తాజాగా తమిళనాడు ఓ అభ్యర్థి జనం దృష్టిని ఆకర్షించేందుకు తన నామినేషన్‌ను వెరైటీగా దాఖలు చేశారు. నామినేషన్ వేసిన సమయంలో చిల్లర డబ్బులు తీసుకెళ్లారు. నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు కొంతమొత్తాన్ని డిపాజిట్ చేశారు. అయితే తమిళనాడుకు చెందిన కుప్పల్జి దేవదోస్ అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా అమ్మ మక్కల్ నేసనల్ పార్టీ (AMNP) నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే నామినేషన్ వసేందుకు వెళ్లిన కుప్పల్జి రూ. 25వేలు డిపాజిట్ కట్టాల్సి ఉండగా... అయితే డబ్బు మొత్తాన్ని చిల్లరగా చేల్లించారు.

మొత్తం రూ. 10, రూ.5, రూ.2, రూ.1 నాణాలతోనే మొత్తం రూ.25వేల చెల్లించారు. సౌత్ చెన్నై జోనల్ ఆఫీస్‌కు చేరుకున్న ఆయన మొత్తం 13 పాత్రాల్లో చిల్లరను తీసుకొచ్చి డిపాజిట్ చెల్లించాడు. కుప్పల్జీ చేసిన ఈ వెరైటీ పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేశవ్యాప్తంగా ఈయన నామినేషన్ హాట్ టాపిక్‌గా మారింది. ఏప్రిల్ 19న తమిళనాడు అసెంబ్లీలో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 39 ఎంపీ స్థానాలకు ఈసారి అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటే మే 23న ఎన్నికల ఫలితాలు రానున్నాయి.


First published: March 26, 2019, 1:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading