Home /News /politics /

TJS PRESIDENT KODANDARAM TO CONTEST FORM NALGONDA KHAMMAM WARANGAL GRADUATE CONSTITUENCY AK

ఎన్నికల బరిలో కోదండరాం.. అక్కడి నుంచి పోటీ..

కోదండరామ్ (పైల్ ఫోటో)

కోదండరామ్ (పైల్ ఫోటో)

Prof Kodandaram: తెలంగాణ సీఎం కేసీఆర్‌తో విభేదాల తరువాత తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కోదండరాం... గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

    తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, టీజేఏసీ మాజీ చైర్మన్ కోదండరాం మళ్లీ ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. వచ్చే ఏడాది జరగబోయే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోదండరాం బరిలోకి దిగాలని టీజేఎస్ నేతలు ఆయనను కోరారు. అయితే దీనిపై పార్టీ సమావేశంలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. మరోవైపు కోదండారం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగడం దాదాపు ఖాయమని.. దీనిపై అధికారికంగా నిర్ణయం తీసుకోవడం మాత్రమే మిగిలిందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.

    తెలంగాణ సీఎం కేసీఆర్‌తో విభేదాల తరువాత తెలంగాణ జనసమితి అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన కోదండరాం... గత ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే సీట్ల సర్దుబాటు కారణంగా ఆయన గత ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి తరపున ప్రచారం చేశారు. అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కోదండరాం వంటి వారికి మంచి ఫలితాలు వస్తాయని,. చట్టసభలో అడుగుపెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని టీజేఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచి చేదు అనుభవాలను మూటగట్టుకున్న కోదండరాం.. ఈసారి సొంతంగా పోటీ చేసి విజయాన్ని సొంతం చేసుకుంటారేమో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Kodandaram, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు