కేసీఆర్‌కు కోదండరామ్ వార్నింగ్.. అలా చేయలేదో..

గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఆ భేటీలో ప్రధానంగా ఆర్టీసీపైనే చర్చించబోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుంటారో అని ఇటు ఆర్టీసీ కార్మికులు.. అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.

news18-telugu
Updated: November 27, 2019, 8:43 PM IST
కేసీఆర్‌కు కోదండరామ్ వార్నింగ్.. అలా చేయలేదో..
కోదండరాం, కేసీఆర్
  • Share this:
కోర్టులో ప్రస్తుతానికి కేసులు ముగిశాయి. ఆర్టీసీ కార్మికలు బెట్టువీడి విధుల్లోకి వస్తామని చెప్పారు. ఐనా ప్రభుత్వం నుంచి మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఆర్టీసీ భవితవ్యం ఏంటననే దానిపై ప్రకటన చేయలేదు. ఐతే గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. ఆ భేటీలో ప్రధానంగా ఆర్టీసీపైనే చర్చించబోతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుంటారో అని ఇటు ఆర్టీసీ కార్మికులు.. అటు ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఐతే కేసీఆర్ నిర్ణయం సానుకూలంగా లేకుంటే హైదరాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ తెలిపారు.

ఇప్పటి వరకు కార్మికుల సమ్మెకు సంఘీభావంగానే నిలిచామని.. ఇకపై తామూ పోరాటం సాగిస్తామని స్పష్టంచేశారు. మరో రెండు మూడు రోజుల్లో పూర్తి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కార్మికుల సమస్యలను ప్రజా సమస్యలుగా మార్చి ప్రజా ఉద్యమంగా మలుస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కోదండరామ్. ఆర్టీసీ సమస్యపై అన్ని పార్టీలను పిలిచి సీఎం కేసీఆర్ మాట్లాడుతారని భావించామని, కానీ అలా చేయలేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకోవాలని లేదంటే మరో ఉద్యమం తప్పదని స్పష్టం చేశాు.


First published: November 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>