హోమ్ /వార్తలు /రాజకీయం /

Telangana ఉద్యోగాల్లో మొత్తం ఖాళీలెన్ని? CM KCR ఇచ్చినవెన్ని? ప్రైవేటులో స్థానికత ఏది? : Kodandaram

Telangana ఉద్యోగాల్లో మొత్తం ఖాళీలెన్ని? CM KCR ఇచ్చినవెన్ని? ప్రైవేటులో స్థానికత ఏది? : Kodandaram

కేసీఆర్ తో కోదండరామ్(పాత ఫొటో)

కేసీఆర్ తో కోదండరామ్(పాత ఫొటో)

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ వేదికగా చేసిన మెగా కొలువుల జాతారపై తెలంగాణ ఉద్యమనేత, టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ భిన్నంగా స్పందించారు. అసలు తెలంగాణ ఉద్యోగాల్లో ఎన్ని ఖాళీలున్నాయో చెబుతూ..

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ బుధవారం నాడు అసెంబ్లీ వేదికగా సంచలన ప్రకటన చేశారు. ఏకంగా 91,142 కొలువులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. అందులో ఇప్పటికే ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోను కొత్తగా 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పారు. కేసీఆర్ మెగా రిక్రూట్మెంట్ ప్రకటించిన మరుక్షణం నుంచి రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయాయి. పలు చోట్ల నిరుద్యోగ సంఘాలు సైతం పటాకులు పేల్చుతూ కేసీఆర్ జిందాబాద్ నినాదాలు చేశాయి. అయితే, కేసీఆర్ కొలువుల ప్రకటనపై విపక్ష నేతల నుంచి మాత్రం అనూహ్య స్పందన వెలువడుతున్నది. ప్రధానంగా..

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగన కనబడుతూ, కేసీఆర్ రాజకీయ పోరాటానికి అన్నిరకాలుగా దన్నుగా నిలిచి, ‘నీళ్లు, నిధులు, నియామకాలు’ ట్యాగ్ లైన్ సామాన్యులకూ చేరవేయడంలో కీలక భూమిక పోషించి, ఒక దశలో ఇదే ఉద్యోగాల కోసం కేసీఆర్ పై తిరుగుబావుటా ఎగరేసి, తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని కూడా స్థాపించిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇవాళ్టి కేసీఆర్ కొలువుల జాతరపై భిన్నంగా స్పందించారు. సీఎం ప్రకటన సంతృప్తికరంగా లేదన్న కోదండరామ్.. అందుకు కారణాలనూ వివరించారు..

CM KCR: ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనా? -జాబ్ క్యాలెండర్‌లో మతలబు? -నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!


తెలంగాణలో వివిధ శాఖల్లో అంతా కలిపి ప్రస్తుతం 1.92ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటే, కేసీఆర్ మాత్రం కేవలం 80 వేల ఉద్యోగాలకు మాత్రే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడాన్ని కోదండరామ్ తప్పుపట్టారు. అదే సమయంలో, గడిచిన ఏడేళ్లలో కేసీఆర్ సర్కారు ఇప్పటి వరకూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకోవడం అబద్ధమని, వాస్తవంగా అన్ని నియామకాలు జరగలేదని టీజేఎస్ చీఫ్ పేర్కొన్నారు. కాగా,

CM KCR: జాతీయ రికార్డు బద్దలు! -కొత్తగా 80,039 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు -ఖజానాపై భరం ఎంతో తెలుసా?


ఉద్యోగాలకు సంబంధించి సీఎం కేసీఆర్ ఇవాళ అసెంబ్లీ వేదికగా చేసిన భారీ ప్రకటనలో ఒకేఒక్క అంశాన్ని ప్రొఫెసర్ కోదండరామ్ స్వాగతించారు. జోన్లవారీగా 95శాతం ఉద్యోగాలను స్థానికులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నానని కోదండరామ్ చెప్పారు. అదే సమయంలో ప్రైవేటు ఉద్యోగాల్లో కూడా దీనిని(95 శాతం స్థానికతను) అమలు చేయాలని, దీనిపై కేసీఆర్ సర్కారు సమగ్రమైన ప్రకటన చేయాలని ప్రొఫెసర్ డిమాండ్ చేశారు. అలాగే, కేసీఆర్ ప్రకటనలో నిరుద్యోగ భృతి అంశం లేదని గుర్తుచేసిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Kodandaram, Telangana Budget 2022, Telangana jobs

ఉత్తమ కథలు