2 రోజుల్లో సీట్ల సంగతి తేల్చండి: కూటమికి కోదండరాం డెడ్‌లైన్..

మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కి రాలేదు. ఓవైపు టీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంటే.. కూటమి మాత్రం ఇంకా అభ్యర్థుల ఖరారుకే కాలయాపన చేస్తుండటం గమనార్హం.

news18-telugu
Updated: October 10, 2018, 5:04 PM IST
2 రోజుల్లో సీట్ల సంగతి తేల్చండి: కూటమికి కోదండరాం డెడ్‌లైన్..
కోదండరామ్ (ఫైల్ ఫొటో)
  • Share this:
కేసీఆర్‌ను గద్దె దించడం.. అమరుల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా మహాకూటమిలో చేరిన టీజేఎస్‌కు సీట్ల విషయంలో ఇంకా ఎటువంటి హామి లభించలేదు. సీట్ల సర్దుబాటు ఇప్పటికే జాప్యం కావడంతో.. కూటమి పెద్దలకు టీజేఎస్ చీఫ్ కోదండరాం రెండు రోజుల డెడ్ లైన్ విధించినట్టు తెలుస్తోంది. అందుకే సీట్ల విషయంపై రెండు రోజుల్లో స్పష్టత రాబోతుందని చెబుతున్నారాయన.

టీజేఎస్ మొత్తం 30సీట్లను డిమాండ్ చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం 9సీట్లకు మించి ఇచ్చేందుకు సుముఖంగా లేదు. ఆ తొమ్మిదిలోనూ ఐదు సీట్లు హైదరాబాద్‌లోని ముస్లిం ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలేనని తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వ్యవహారంపై కోదండరాం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్ తమను ఇలాగే లైట్ తీసుకుంటే.. తమ దారి తాము చూసుకునే యోచనలో కోదండరాం ఉన్నట్టు తెలుస్తోంది.


సొంతంగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఇప్పటికే ఓ జాబితాను కూడా రూపొందించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తొలి విడుతలో 22మంది జాబితాను, మరో విడుతలో 30మంది జాబితాను విడుదల చేసే ఆలోచనలో ఆయన ఉన్నట్టు సమాచారం. మహాకూటమిపై ఇంత ప్రచారం జరిగాక.. ఇప్పుడు అర్థాంతరంగా కోదండరాం దాని నుంచి వైదొలిగితే కూటమికి అది మైనస్ అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. కాబట్టి టీజేఎస్‌తో సీట్ల సర్దుబాటును కాంగ్రెస్ ఎలా డీల్ చేయబోతుందన్నది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.




Published by: Srinivas Mittapalli
First published: October 10, 2018, 4:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading