Tirupati By-poll: కమలం వర్సెస్ ఫ్యాన్... ట్విట్టర్లో పేలుతున్న తూటాలు...

విజయసాయి రెడ్డి, సోము వీర్రాజు మధ్య ట్విట్టర్ వార్

తిరుపతి ఉపఎన్నిక (Tirupati By-poll) టైమ్ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల మధ్య వైరం తారాస్టాయికి చేరుతున్నాయి. సోషల్ మీడియాలో ట్వీట్లు పేలుతున్నాయి.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ విషయంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీల కంటే.. వైసీపీ.. భారతీయ జనతా పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల ముఖ్యనేతల మధ్య ట్విట్టర్ ద్వారా వార్ జరుగుతోంది. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను సీఎంను చేస్తామన్న వ్యాఖ్యలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతల విజయసాయి రెడ్డి స్పందించారు. రెండు పార్టీలు డ్రామాలాడుతున్నాయని.. వారి డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారంటూ ట్వీట్ చేశారు. దీనికి కౌంటర్ గా సోము వీర్రాజు కూడా ట్వీట్ చేశారు. త్వరలోనే జైలుకెళ్లబోతున్నారని ఎద్దేవా చేశారు. దీంతో బీజేపీ-వైసీపీ మధ్య సోషల్ మీడియా వార్ పీక్స్ కు చేరుతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరింది.

  విజయసాయి రెడ్డి ఏమన్నారంటే...”తిరుపతి ఉప ఎన్నికల ముందు మీరు వేస్తున్న డ్రామాలకు జనం నవ్వుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో డిపాజిట్లు వస్తే చాలు మన వాడు సీఎం అయిపోతాడన్నట్లు నటిస్తున్నారు. ఎవరి పాత్రల్లో వారు జీవించండి...చెవిలో క్యాబేజీ పూలు పెట్టండి. జనం మాత్రం మళ్లీ వైసీపీనే దీవిస్తారు.” అటూ ట్వీట్ చేశారు.


  దీనికి సోము వీర్రాజు గట్టిగానే రియాక్ట్ అయ్యారు. “మా ఊసు ఎందుకులే విజయసాయి రెడ్డి గారూ..!!! కోర్టులకు చెవులో పువ్వులు పెడుతూ బయట మేకపోతు గాంభీర్యంతో తిరుగుతున్నా లోపల గోళ్లు కొరుక్కుంటున్నారంటగా అలీబాబా నలభై దొంగలంతా. తిరుపతి ప్రజలకి మేం ఏం ఇచ్చామో చెప్పి క్యాబేజి పువ్వులు మీకు పంపిస్తాం బెయిల్ రద్దవగానే కూరకి లోపల ఉపయోగపడతాయి.” అంటూ కౌంటర్ ట్వీట్ చేశారు.

  ఇది చదవండి: సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పవన్ కల్యాణ్ కే వీర్రాజు ఓటు..  తిరుపతిలో జనసేన-బీజేపీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొన్న సోము వీర్రాజు... పవన్ కల్యాణ్ ను ఏపీ సీఎంగా చూడటమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా కూడా ఇదే మాట చెప్పారన్నారు. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి ట్వీట్ చేసి పొలిటికల్ హీట్ పుట్టించారు. అటు వైసీపీ ట్వీట్లు, ఇటు బీజేపీ కౌంటర్లతో తిరుపతి పోరు తారాస్థాయికి చేరింది. ఇక్కడ 5 లక్షల మెజారిటీ సాధించి రికార్డు సృష్టించాలని వైసీపీ భావిస్తోంది. ఇందుకోసం మంత్రులు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. ఈ క్రమంలో వైసీపీ అభ్యర్థి గురుమూర్తి సోమవారం నామినేషన్ దాఖలు చేశారు.

  మరోవైపు జనసేన పొత్తుతో బరిలో దిగిన బీజేపీ.. హిందూత్వ నినాదంతో ముందుకెళ్లి ఓట్లు కొల్లగొట్టాలని చూస్తోంది. గెలవకపోయినా కనీసం గట్టిపోటీ ఇచ్చేలా ముందుకెళ్లాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సోము వీర్రాజు పవన్ టాపిక్ తీసుకురాగా.. ట్వీట్ వార్ మొదలైంది.
  Published by:Purna Chandra
  First published: