ఒంటరిగా ఉన్న అమ్మాయిని ఇంటికి దిగబెడతాను అంటూ లిఫ్ట్ ఇచ్చాడు.. ఆ తరువాత ఏం జరిగిందంటే..?

లిఫ్ట్ పేరుతో అఘాయిత్యం

ఇప్పటికీ అమ్మాయిలు ఒంటరిగా రోడ్డుపైకి వెళ్లాలి అంటే భయపడాల్సి వస్తోంది. తాజాగా ఓ కామాంధుడు లిఫ్ట్ పేరుతో ఓ యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన కలంకలం రేపుతోంది.

 • Share this:
  మహిళలు ఒంటరిగా అర్థరాత్రి తిరగగలిగితేనే నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అన్నారు మహాత్మాగాంధీ.. కానీ పట్ట పగలు.. అందరూ రోడ్డుపై తిరుగుతున్న సాయంత్రం సమయంలోనూ సైతం  వారికి రక్షణ కరువు అవుతోంది. పనిపై రోడ్డు మీదకు వెళ్లే అమ్మాయి క్షేమంగా తిరిగి వస్తారా లేదా అని భయంతో ఎదురు చూడాల్సాన పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు.  మొన్న నిర్భయ., నిన్న దిశా ఇవాళ ఎందరో మహిళలు కామాంధుల కాటుకు బలి అవుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలు అమలు చేసిన అత్యాచారం చేసేదుకు మృగాళ్ళు వెనకాడటం లేదు. ఫోక్సో, దిశా, నిర్భయ లాంటి చట్టాలు అమలులో ఉన్న ఆడవారికి రక్షణ కరువు అవుతూనే ఉంది. కొంతమంది కామాంధులు..  సహాయం చేస్తామని నమ్మించి మరి లైంగిక దాడికి పాల్పడుతున్నారు. తాజాగా తిరుపతిలో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఓ యువతిని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన వివాహితుడి ఉదంతం వెలుగు వచ్చింది.

  ఓ యువతీ తల్లి  రెండేళ్ల క్రితం మృతి చెందింది. తల్లి చనిపోయిన ఏడాది తరువాత తండ్రి కూడా అనారోగ్యంతో మరణించాడు. అనాథగా మారిన ఆ యువతీ కుటుంబ స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటూ.. జీవనం సాగిస్తోంది. ఈ నెల 28వ తేదీన సాయంత్రం తిరుపతి  వెళ్లేందుకు ఆటో ల కోసం 19 ఏళ్ల యువతీ నిరీక్షిస్తూ ఉంది. తిరుపతికి మారుమూల ప్రాంతం కావడంతో అడపాదడపా ఆటోలు, ఇతర వాహనాలు వాస్తు వెళ్తూ ఉంటాయి. అర్ధగంట పాటు ఆటో కోసం నిరీక్షించిన ఆ యువతికి ఒక్క ఆటో కూడా రాకపోవడంతో అక్కడే వేచి చూస్తూ ఉంది.

  ఆ యువతిని గమనించిన బిటిఆర్ కాలనీకి చెందిన వివాహితుడు 30 ఏళ్ల నాగేంద్ర బాబు ఒంటరిగా ఉన్న యువతిపై కన్నేశాడు. ఆమెను వలలో వేసుకోవాలి అనున్నాడు. ఆటోలు రావడం లేదనే నెపంతో తాను తిరుపతికి వెళ్తున్నాను.. తనను వదిలి పెడతానని చెప్పాడు. దింతో నమ్మి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకొని వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక దుకాణంలో కూల్డ్రింక్ తీసి అందులో మత్తు గుళికలు వేసి ఆ యువతీ సేవించేలా చేసాడు. మత్తులో జారుకున్న యువతిని తిరుపతి బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీనివాసం ఎదురుగా ఓ లార్జీలో గదిని అద్దెకు తీసుకోని అత్యాచారానికి పాల్పడ్డాడు. దింతో తీవ్ర అనారోగ్యానికి లోనైనా యువతీ శుక్రవారం రాత్రి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడైన నాగేంద్రబాబును అదుపులోకి తీసుకోని తమ స్టైల్ లో విచారణ చేపడుతునన్నారు పోలీసులు.
  Published by:Nagesh Paina
  First published: