TIRUPATI BY POLL BJP CANDIDATE RATNA PRABHA STATED THAT CONGRESS PARTY DID MISTAKE BY PROMISING TO GIVE SPECIAL STATUS FOR ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
AP Special Status: ప్రత్యేక హోదాపై బీజేపీ కొత్తపల్లవి... ఆ మాటే తప్పంటున్న కీలక నేత
ప్రతీకాత్మక చిత్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు ప్రత్యేక హోదా (Special Status) విషయంలో బీజేపీ (Bharatiya Janatha Party) కొత్తపల్లవి అందుకుంది. ఆ తప్పును కాంగ్రెస్ పార్టీపై (Congress Party) నెట్టే యత్నం చేస్తోంది.
ప్రత్యేక హోదా. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పదం చాలా పాపులర్. రాష్ట్రంలో ప్రత్యేక హోదా నినాదం.. ప్రజల కంటే రాజకీయ పార్టీలకే ఎక్కువ ప్రయోజనం చేకూర్చిందే అనడంలో సందేహం లేదు. ఏడేళ్లుగా ప్రత్యేక హోదా నినాదం.. లేవనెత్తుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. హోదా స్థానంలో ప్యాకేజీ అంటూ ప్రకటించిన కేంద్రం అది ఏ రూపంలో ఇస్తున్నారో స్పష్టం చేయలేదు. ఇక ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర హోంశాఖ పార్లమెంటులో స్పష్టం చేసింది. దీంతో మరోసారి ప్రత్యేక అంశం చర్చనీయాంశమైంది. ఈలోగా తిరుపతి ఉఫ ఎన్నికకు నోటిఫికేషన్ రావడంతో హోదా అంశం హాట్ టాపిక్ గా మారింది. ప్రత్యేక హోదా అంశాన్ని హైలెట్ చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఇదే అంశంపై బీజేపీని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో జనసేన-బీజేపీ ఉమ్మడి అబ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నప్రభ ప్రత్యేక హోదా అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీదే తప్పు
తిరుపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లిన రత్నప్రభ.. ప్రత్యేక హోదా అంశం గురించి మాట్లాడారు. అసలు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడమే తప్పన్నారు. ప్రత్యేక హోదా అనేది కేవలం ఈశాన్య రాష్ట్రాలను ఉద్దేశించి ప్రవేశపెట్టడం జరిగిందని.. ఏపీ లాంటి రాష్ట్రాలకు అవసరం లేదన్నారామె. పెద్ద రాష్ట్రాలకు హోదా సాధ్యం కాదన్నారు. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని ఆమె స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తోందన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామనడమే తప్పని రత్నప్రభ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంమవుతోంది.
వైసీపీ రియాక్షన్ ఇదే..
రత్నప్రభ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు విశ్రమించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ప్రత్యేక హోదా హామీ నెరవేర్చకుండా మోసం చేశారని ఆరోపించారు. ఎవరెన్ని చెప్పినా ప్రత్యేక హోదా సాధనే తమ లక్ష్యమన్నారు. ఇక ఇదే అంశంపై మాట్లాడిన వైసీపీ అధికార ప్రతినిథి అంబటి రాంబాబు.. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల హోదా విషయంలో కేంద్రం మెడలు వంచలేకపోతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం మనసు మారేవరకు హోదా అడుగుతూనే ఉంటామన్నారు. అవసరమైతే పోరాటం చేస్తామని తెలిపారు.
బీజేపీ గట్టెక్కుతుందా..?
ఇటు ప్రత్యేక హోదా, అటు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యవహారంలో బీజేపీని ఇరుకునపెట్టేందుకు వైసీపీ, టీడీపీ యత్నిస్తున్నాయి. ఈ రెండు అంశాల్లో ఇబ్బందులెదుర్కొంటున్న బీజేపీ.. స్టీల్ ప్లాంట్ టాపిక్ ఎత్తకపోయినా... హోదా విషయంలో మాత్రం కుండబద్దలు కొడుతోంది. ఐతే ఇన్నాళ్లూ హోదా లేదు అంటూ మాట్లాడిన బీజేపీ నేతలు.. ఇప్పుడు హోదా హామీ ఇవ్వడమే తప్పు అని ఆ వ్యవహారాన్ని కాంగ్రెస్ పై నెట్టే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ హోదా ఇవ్వలేదు అనే మాటకంటే.. ఏపీ లాంటి రాష్ట్రానికి హోదా ఇస్తామనడమే మోసం అనే మాటను ప్రజల్లోకి తీసుకెళ్లాని చూస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి ఈ మాట తిరుపతిలో బీజేపీకి ప్లస్ అవుతుందో.. లేక మైనస్ అవుతుందో వేచిచూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.