tirupati loksabha by poll: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు నోటిఫికేషన్: ఏప్రిల్ 17 పోలింగ్

మే 17 తిరుపతి ఉప ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

 • Share this:
  ఎప్పుడా ఎప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏఫ్రిల్ 17న పోలింగ్, మే2న ఫలితాలు వెలువడనున్నాయి.

  ఆంధ్రప్రదేశ్ లోని  తిరుపతి లోక్‌సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏప్రిల్‌ 17న తిరుపతి లోక్‌సభ స్థానానికి సైతం ఎన్నికల నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

  తిరుపతి ఎంపీగా గత ఎన్నికల్లో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్‌ గతేడాది సెప్టెంబరు 16న మరణించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది.  తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా అన్ని పార్టీలు ముందస్తుగానే సిద్ధం అయ్యాయి. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అందరికంటే ముందుగా టీడీపీ అధిష్టానం తమ అభ్యర్థిని నిలబెట్టింది. కేంద్ర మాజీ  మంత్రి పనబాక లక్ష్మిని అభ్యర్థిగా ప్రరకటించింది టీడీపీ అయితే దీనిపై చాలా విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీకి తిరుపతిలో అభ్యర్థి కూడా లేరని.. పనబాక లక్ష్మి పేరును ప్రకటించినా ఆమె పోటీకి సిద్ధంగా లేరంటూ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయ్యింది కాబట్టి మరి దీనిపై టీడీపీ క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి..

  ఇటు అధికార వైసీపీ డాక్టర్ గురుమూర్తిని అభ్యర్థి అంటూ లీకులు ఇచ్చింది. బుల్లి దుర్గా ప్రసాద్ తనయుడు కళ్యాణ్ చక్రవర్తికి ఇప్పుటికే ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చింది అధిష్టానం. దీంతో గురుమూర్తిని అభ్యర్థిగా ప్రకటించడం లాంఛనమే అంటున్నారు. మరోవైపు ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ లో ప్రతిపక్షాలు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో అభ్యర్థి ఎవరైనా గెలుపు తమదే అనే ధీమాతో  ఉంది వైసీపీ. తిరుపతి ఉప ఎన్నికలో విజయం తమదే అంటున్నారు మంత్రి పెద్ది రెడ్డి

  ఇక బీజేపీ-జనసేన ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి.  ఇటీవల జనసేన అధినేత పవన్ తో భేటీ అయిన బీజేపీ పెద్దలు.. ఆయన్ను ఒప్పించి బీజేపీ అభ్యర్ధిని నిలబెడుతున్నట్టు క్లారిటీ ఇచ్చారు. దీంతో అప్పటి నుంచి ఆశావాహులంతా తమకే సీటు ఇవ్వాలంటూ అధిష్టానం చుట్టూ క్యూ కట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు ఆ ప్రయత్నాల్లో బిజీగానే ఉన్నట్టు సమాచారం. ఆశావాహులైన పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌ల పేర్లను పరిశీలించిన బీజేపీ తుది లిస్ట్‌ను తయారు చేసింది. దీనిపై అధికారికంగా క్లారిటీ ఇవ్వకపోయినా.. ఇప్పటికే ఆ అభ్యర్థికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ శాఖల్లో పనిచేసిన దాసరి శ్రీనివాసులు చాలా రోజుల కిందటే బీజేపీలో చేరారు. ఆయన పేరు తిరుపతి బైపోల్స్‌ ప్రకటించక ముందు నుండీ బలంగా వినిపిస్తూ వస్తోంది. ఆయన కూడా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి చింతామోహన్ కూడా మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది.
  Published by:Nagesh Paina
  First published: