HOME »NEWS »POLITICS »tirupati by election candidates confusion in bjp and janasena bk

Tirupati by Election: క‌న్ఫ్యూజన్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.... సాగ‌దీస్తున్న బీజేపీ.!

Tirupati by Election: క‌న్ఫ్యూజన్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్.... సాగ‌దీస్తున్న బీజేపీ.!
ప్రతీకాత్మక చిత్రం

తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌, బిజేపీ నుంచి ఉమ్మ‌డి అభ్య‌ర్ధి బ‌రిలో ఉంటార‌ని ప్ర‌క‌టించిన‌ప్ప‌టికి ఆ ఉమ్మ‌డి అభ్య‌ర్ధి ఏ పార్టీకి చెందిన వ్య‌క్తి అనేదానిపై ఇంకా రాని స్ప‌ష్ట‌త‌!!

  • Share this:
    తిరుప‌తి ఉప ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ ఏ క్ష‌ణ‌మైన విడుద‌ల కానున్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీలు ఇప్ప‌టికే అక్క‌డ పాగా వేయ‌డానికి వ్యూహాల‌ను సిధ్దం చేసుకున్నాయి. ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ ఇప్ప‌టికే త‌మ అభ్య‌ర్ధిపై కూడా స్ప‌ష్ట‌త ఇచ్చి గ్రౌండ్ వ‌ర్క్ కూడా ప్రారంభించింది. అయితే ఈ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ టీడీపీ వైసీపీ మ‌ధ్య ఉన్న‌ప్ప‌టికే తెలంగాణ‌లో వ‌చ్చిన అన్యూహామైన గెలుపు త‌రువాత ఏపీ పై కూడా బీజేపీ పెద్ద‌ల దృష్టి ప‌డింది. గెలుపు కోసం కాక‌పోయిన రెండో స్థానంలో నిల‌వ‌డాకైన ఈ ఎన్నికను మంచి అవ‌కాశంగా మార్చుకోవాల‌ని భావిస్తోన్నాయి ఆ పార్టీ శ్రేణులు. ఇందులో భాగంగానే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తో కూడా చేతులు క‌లిపింది ఆ పార్టీ. అయితే ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధిని ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టించాల‌ని ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి మ‌రి అక్క‌డ పెద్ద‌ల వ‌ద్ద విజ్ఞ‌ప్తి చేసుకున్నారు. త‌మ‌పార్టీకి తిరుప‌తిలో మంచి బ‌లం ఉన్నందున త‌మ పార్టీ అభ్య‌ర్ధినే ఉమ్మ‌డి అభ్య‌ర్ధిగా ప్ర‌క‌టిస్తే బాగుంటుంద‌ని ప‌వ‌న్ గ‌తంలో కేంద్ర పెద్ద‌ల‌ను కోరారు.

    అయితే దీనికి అటువైపు నుంచి కూడా సానుకూల‌మైన ప్ర‌తిస్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికి, అప్ప‌టి నుంచి ఈ అంశంపై ప‌వ‌న్ పెద్ద‌గా దృష్టి పెట్ట‌డం లేదు. అయితే తాజాగా కొంత‌మంది బిజేపీ నాయుకులు చేస్తోన్న కామెంట్స్ ప‌ట్ల ప‌వ‌న్ అసంతృప్తి వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు తెలుస్తోంది.  దింతోపాటు ఇప్పటికి బ‌రిలో ఉండ‌బోయే అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డం పై ఆ పార్టీ నేత‌లు కాస్త గుర్రుగా ఉన్న‌ట్లు రాజ‌కీయ‌వ‌ర్గాల స‌మాచారం. ఉమ్మ‌డి అభ్య‌ర్ధి ఉంటార‌ని చెబుతున్నారు కాని ఆ ఉమ్మ‌డి అభ్య‌ర్ది బీజేపీ త‌రుపు అభ్య‌ర్ధా లేకా జ‌న‌సేనా అభ్య‌ర్ధా అనే అశంపై ఇప్ప‌టికే దాగుడులు మూత‌లాడుతుంది బీజేపీ. దీంతో పవ‌న్ ఒక విధ‌మైన క‌న్ఫ్యూజన్‌లోకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. స్వ‌యంగా వెళ్లి కోరిన‌ప్ప‌టికి ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్ధికి సంబంధించి ఒక స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోవ‌డ‌మేంట‌ని ప‌వ‌న్ అస‌హానం వ్య‌క్తం చేస్తోన్న‌ట్లు స‌మాచారం.



    ఇదిలా ఉంటే ఇరు పార్టీనుంచి స‌మ్మ‌త‌మైన అభ్య‌ర్దిని ఎన్నొకోవ‌డానికి గ‌తంలో ఒక క‌మిటిని వేశారు అయితే ఈ క‌మిటి ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారిగా స‌మావేశం నిర్వ‌హించ‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌ర్హం. ఇలా చివ‌రి వ‌ర‌కు నాచ్చి అప్పుడు మొండి చేయి చూపిస్తే ఏం చేయాల‌న్నదానిపై జ‌న‌సేన శ్రేణులు క‌స‌రత్తు చేస్తోన్నాయి. అయితే బిజేపీ శ్రేణులు మాత్రం త‌మ పార్టీ వ్య‌క్తినే బ‌రిలో దించి జ‌న‌సేన మ‌ద్ద‌తు కోరాల‌ని చూస్తోంది. దీనికి జ‌న‌సేన శ్రేణులు ఒప్పుకునే ప‌రిస్థితులు క‌నిపించ‌డం లేదు. బిజేపీ కి అక్క‌డ ఒక్క శాతం ఓటు షేరు బ‌లంగా ఉంటే జ‌న‌సేన‌కు దాదాపు 7 శాతం ఉంది. ఆపార్టీ బ‌లం కంటే త‌మ పార్టీ బ‌ల‌మే ఎక్కువ కాబ‌ట్టి తాము ఫైన‌ల్ చేసిన అభ్ర‌ర్దినే బ‌రిలో దించాల‌ని భావిస్తోన్నాయి ఆ పార్టీ శ్రేణులు. అయితే ఈ అంశంపై అమిత్ షా అండ్ కో త్వ‌ర‌లో ఏం నిర్ణ‌యం తీసుకోబోతున్నార‌నే ఉత్కంఠ స‌ర్వ‌త్ర నెల‌కొంది.
    Published by:Balakrishna Medabayani
    First published:January 18, 2021, 15:34 IST