తిరుపతి ఉపఎన్నికలో (Tirupati By poll) విజయమే దిశగా భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) పావులు కదుపుతోంది. ఇందుకోసం ఢిల్లీ పెద్దలను రంగంలోకి దించుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ, కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన ఇంకా ఎన్నికల హడావిడి అలానే ఉంది. ఇప్పుడు అందరి దృష్టి తిరుపతి ఉప ఎన్నికపైనే ఉంది. ఇప్పటికే అధికార పార్టీ గెలుపు గురించి కాకుండా మెజార్టీ గురించి మాట్లాడుకుంటుంటే మరో వైపు ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఈ ఎన్నికల్లో తమ ఉనికి చాటుకోవడానికి తన శక్తియుక్తులన్నీ కూడగడతోంది. అయితే బీజేపీ ఎలాగైన ఇక్కడ గట్టిపోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో దూసుకుపోతున్న బీజేపీ ఇక్కడ పార్టీ అగ్ర నేతలను ప్రచారంలోకి దించాలని భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలు ఢిల్లీ పెద్ద వద్ద పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే తిరుపతిలో పార్టీ ప్రచారానికి అమిత్ షా రావడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు అమిత్ షాతో పాటు మోడీని కూడా రంగంలోకి దించింతే మంచి ఫలితాలు ఉంటాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే మోడీ పర్యటన ఉండేలా చూడాలని ఇప్పటికే ఢిల్లిలో పెద్దలకు విన్నపాలు పంపించినట్లు తెలుస్తోంది.
ఇదిలాఉంటే చివరి వరకు జనసేన అభ్యర్ధికే టికెట్ ఇస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ నేతలు చివరి నిముషంలో ఆ పార్టీకి మొండి చేయి చూపించారు. దీంతో ఇప్పుడు స్థానికంగాగా ఉన్న జనసేన కేడర్ బిజేపీపై నిప్పులు చెరిగిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక కేడర్ పార్టీకి ఇప్పుడు మద్దతు తెలుపుతారా లేదా అనేది కూడా బీజేపీకి ఒక ఆందోళన గలిగించే అంశంగా ఉంది. వాస్తవానికి జనసేనతో పోల్చుకుంటే బీజేపీ ఓటు శాతం కూడా తక్కువే ఈ కారణంతోనే జనసేన సూచించిన అభ్యర్ధికి టిక్కెట్ ఇస్తారని అందరు భావించారు కానీ చివరి నిముషంలో బిజేపీ పెద్దలు మనసు మార్చుకున్నారు.
ఈ నిర్ణయంపై కాస్త పవన్ పార్టీ లో అసంతృప్తి ఉన్నప్పటికి అది ఎక్కడ బయటపడనియడం లేదు. అయినప్పటికి చాపకింద నీరుగా జనసేన చేయాల్సిన పని తాము చేస్తామని స్థానిక నేతలు ఉన్నట్లు సమాచారం. అందుకే ముందుగా పవన్ ను మచ్చిక చేసుకోవడంతోపాటు, బిజేపీ అగ్రనేతలను ఇక్కడ నుంచి ప్రచార బరిలో ఉంచితే బాగుంటుందనే ఆలోచనలో పార్టీ శ్రేలణులు ఉన్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో టిడిపిని ఓవర్ టెక్ చేసి భవిష్యత్ లో జగన్ పార్టీకి తామే అనే సంకేతాలు ప్రజల్లోకి ఇవ్వాలని భావిస్తోన్నారు ఆ పార్టీ నేతలు. మరి మోడి అండ్ కోం ఏపీ బిజేపీ నేతల ప్రతిపాధనలు వింటారో లేదో చూడాలి.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.