• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • TIRUPATHI MUNICIPAL CORPORATION HAVING ELECTIONS AFTER 20 YEARS LOCAL VOTERS TO ELECT THEIR FIRST MAYOR THIS TIME HERE ARE THE DETAILS PRN

AP Municipal elections : అక్కడ 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు.. ఆలస్యానికి కారణమేంటో తెలుసా..?

AP Municipal elections : అక్కడ 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు.. ఆలస్యానికి కారణమేంటో తెలుసా..?

ప్రతీకాత్మక చిత్రం

ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతున్న తిరుపతిలో (Tirupathi) దాదాపు 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు (Municipal Elections) జరుగుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లోని పెద్ద నగరాల్లో ముఖ్యమైనది తిరుపతి. ఆధ్యాత్మిక రాజధానిగా వెలుగొందుతున్న తిరుపతిలో దాదాపు 20 ఏళ్ల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు పాలకవర్గం లేదు. తిరుపతి 2002లో మున్సిపాలిటీగా ఉన్న సమయంలో తిరుపతికి ఎన్నికలు జరిగాయి. రెండు దశాబ్దాలుగా తిరుపతి నగరానికి పాలవర్గం లేదు. పరిపాలన అంతా అధికారుల చేతుల్లోనే నడుస్తోంది. దీంతో స్థానికంగా ఉండే సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయి. స్థానికుల విజ్ఞప్తుల మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు లేదా టీటీడీ పట్టించుకుంటే తప్ప సరైన పనులు జరగని పరిస్థితి నెలకొంది. 2007లో కౌన్సిల్ పాలకవర్గం ముగిసిన తర్వాత ఎన్నికలు జరగలేదు. 2007 తర్వాత తిరుపతిని మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ చేశారు.

    ఐతే అప్పటి నుంచి రిజర్వేషన్లు ఖరారు కాలేదు. అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియ కూడా పూర్తికాకపోవడం, ఓటర్ల జాబితా కూడా సిద్ధమవకపోవడంతో ఎన్నికల ప్రక్రియకు ముడిపడలేదు. గత ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల ప్రకటన రావడంతో తిరుపతికి కాబోయే తొలి మేయర్ ఎవరనేదానిపై సర్వత్రా చర్చజరిగింది. ఐతే కరోనా కారణంగా ఎన్నికలు వాయిదా పడగా.. ఇటీవలే ఎస్ఈసీ షెడ్యూల్ ప్రకటించారు. గత ఏడాది నోటిఫికేషన్ సందర్భంగా తిరుపతిలోని 50 డివిజన్లకు 324 నామినేషన్లు దాఖలయినట్లు మున్సిపల్ కమిషనర్ పీఎస్ గిరీష ప్రకటించారు. మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల తర్వాత అభ్యర్థుల తుదిజాబితాను ప్రకటించనున్నారు. మార్చి 10 పోలింగ్ జరపనుండగా.. 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.

    ఇది కూడా చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు వీరే... ఆ స్థానానికి మాత్రం వైసీపీ దూరం



    తిరుపతిలో దాదాపు 4లక్షల మంది జనాభా ఉండగా.. 2.66 లక్షల ఓటర్లున్నారు. 50 డివిజన్లలో 14 డివిజన్లు జనరల్ (మహిళకు) కేటాయించగా.. 13 డివిజన్లు జనరల్ కేటగిరీకి కేటాయించారు. 8 డివిజన్లు బీసీ (మహిళ), 9 డివిజన్లు బీసీ, మూడు డివిజన్లు ఎస్సీలు, రెండు డివిజన్లు ఎస్సీ(మహిళ) ఒక డివిజన్ ఎస్టీలకు కేటాయించారు. రెండు దశాబ్ధాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత తిరుపతి వాసులు కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. మరోవైపు తిరుపతి తొలి మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు అటు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశంతో పాటు జనసేన-బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయి. తిరుపతి లోక్ సభ స్థానాని కంటే ముందు జరుగుతున్న ఈ ఎన్నికలు ఉపఎన్నికకు రిఫరెండం కాబోతున్నాయన్న ప్రచారం కూడా సాగుతోంది. మరి వెంకన్నతో పాటు ఓటర్ల ఆశీశ్సులు ఏ పార్టీకి ఉంటాయో మార్చి 14వరకు వేచి చూడాల్సిందే.
    Published by:Purna Chandra
    First published:

    అగ్ర కథనాలు