హోమ్ /వార్తలు /రాజకీయం /

Tirupathi By-poll: సైలెంట్ గా దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి: టార్గెట్ భారీ మెజార్టీనే అంటున్న అధికార పార్టీ నేతలు

Tirupathi By-poll: సైలెంట్ గా దూసుకుపోతున్న వైసీపీ అభ్యర్థి: టార్గెట్ భారీ మెజార్టీనే అంటున్న అధికార పార్టీ నేతలు

సైలెంట్ గా దూసుకుపోతున్న గురుమూర్తి

సైలెంట్ గా దూసుకుపోతున్న గురుమూర్తి

తిరుపతి ఉప ఎన్నికను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ఇప్పటికే నామినేషన్ వేయగా.. వైసీపీ అభ్యర్థి గురుమూర్తి ఈ నెల 29న నామినేషన్ వేయనున్నారు. మరోవైపు ఇప్పటికే ప్రచారంలో ఆయన సైలెంట్ గా దూసుకుపోతున్నారు.

ఇంకా చదవండి ...

  తిరుపతి ఉప ఎన్నికను అధికార వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికల్లో ఫలితాల జోష్ ను కంటిన్యూ చేయాలని భావిస్తోంది. ఇప్పటికే మంత్రులు తిరుపతిలో మోహరించి గెలుపు కోసం వ్యూహాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నారు. అయితే వైసీపీ తరుపున కొత్త అభ్యర్థి అయినా.. డాక్టర్ గురుమూర్తి సైలెంట్ గా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎలాంటి హడావుడి చేయకుండానే ఆయా నియోజకవర్గ నేతలతో కలిసి ఓటర్లను ఆక్టుటకునే పనిలో బిజీ అయ్యారు.

  సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించి రాబోయే తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గురుమూర్తిని భారీ మెజార్టీతో గెలిపించాలి అని, అందరూ కలిసి పని చేద్దామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ కోరారు. తిరుపతి పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గురుమూర్తిని.. ఇతర నాయకులకు పరిచయం చేశారు ఎమ్మెల్యే. గూడూరు పట్టణంలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ కార్యాలయంలో వైసీపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి పరిచయ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థిని నాయకులు ఘనంగా సన్మానించారు.

  ఎంపీ అభ్యర్థి గురుమూర్తి మాట్లాడుతూ సాధారణ కుటుంబం నుండి వచ్చిన తనను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంపీ అభ్యర్థిగా మీ ముందుకు పంపించారని ఆయన ఆశయ సాధన కోసం సైనికుడిలా పని చేస్తాను అన్నారు. నాయకులంతా తనకు ఆశీర్వాదం అందించాలని అందరినీ కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేశారు. ఎంపీగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తీసుకు వస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి విజయం తధ్యమని కేవలం భారీ మెజారిటీ కొరకు నాయకులు కార్యకర్తలు పనిచేయాలని కోరారు. మాట తప్పక ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

  కేవలం వైసీపీనే కాదు టీడీపీ సైతం ఈ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పంచాయతీ, మున్సిపల్లో ఎన్నికల్లో ఘోర ఓటమికి తిరుపతి ఉప ఎన్నిక ద్వారా సమాధానం ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి ముందే నామినేషన్ దాఖలు చేసి.. ప్రచారంలో దూకుడు పెంచారు. టీడీపీ కీలక నేతలంతా అక్కడే ఉండి పనబాక గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు..

  మరోవైపు బీజేపీ,జనసేన ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసింది. అందరూ అనుకున్నట్లుగానే మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. మరో ఇద్దరు మాజీ ఐఏఎస్ లు, ఓ మాజీ మంత్రి పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. చివరకు బీజేపీ రత్నప్రభ వైపే మొగ్గు చూపింది. ఆమె త్వరలోనే నామినేషన్ వేయనున్నారు. అలాగే ప్రచారబరిలోకి దిగనున్నారు. తిరుపతి ఉపఎన్నికలో రత్నప్రభ.. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తారని బీజేపీ ప్రకటించింది. ప్రకాశం జిల్లాకు చెందిన రత్నప్రభ., కర్ణాటక కేడర్ ఐఏఎస్ గా అనేక కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. ముక్కుసూటి అధికారిగా పేరున్న ఆమెకు ఫైర్‌ బ్రాండ్‌ ముద్రకూడ ఉంది. పేరొందిన రత్నప్రభ అయితేనే వైసీపీని ధీటుగా ఎదుర్కొంటారన్న ఉద్దేశంతో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు.

  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Tdp, Tirupati, Tirupati Loksabha by-poll, Ycp

  ఉత్తమ కథలు