TTD: టీటీడీ పాలకమండలి పదవి కోసం లాబీయింగ్.. సభ్యులను భారీగా పెంచే యోచన..!

టీటీడీ పాలకమండలి ఈ సారీ భారీ జంబో టీంగా ఏర్పాడనుందా..? ప్రస్తతుం 25 మంది సభ్యులు ఉంటే.. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు అవుతోందా..? ఏపీ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..

టీటీడీ పాలకమండలి ఈ సారీ భారీ జంబో టీంగా ఏర్పాడనుందా..? ప్రస్తతుం 25 మంది సభ్యులు ఉంటే.. ఈ సారి ఆ సంఖ్య రెట్టింపు అవుతోందా..? ఏపీ సర్కార్ ఏం ఆలోచిస్తోంది..

 • Share this:
  GT. హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18,           ప్రపంచ ప్రఖ్యాత హైందవ పుణ్యక్షేత్రం తిరుమల. కోటాను కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీవేంకటేశ్వరుడు. అప్పటి బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు స్వామి వారి దేవస్థానం పరిపాలన అవసరాల దృష్ట్యా పాలకమండలిని ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. భక్తుల సంఖ్య ఘననీయంగా పెరిగిన విధంగానే.. శ్రీవారి దర్శనాలు., సేవలకు ఎనలేని డిమాండ్ ఉంటోంది. స్వామి వారిని ఒక్కసారి చూస్తే సరిపోదు.. నిత్యం చూస్తుంటే ఎంత బాగుణ్ణో అనే భావన ప్రతి భక్తుడి మదిలో మెదులుతుంది. అందుకే శ్రీ వేంకటేశ్వరుడి దర్శనానికి చాల డిమాండ్. ఆ డిమాండ్ తోటే  టీటీడీ పాలకమండలిలో చోటు కోసం రాజకీయ నాయకుల నుంచి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు లాబీయింగ్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే చైర్మన్ పోస్ట్ పై ఉత్కంఠకు ఏపీ ప్రభుత్వం తెరదించింది. వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ పాలకమండలి చైర్మన్ గా తిరిగి నియమించింది. దింతో చైర్మన్ పదవి ఆశావహులకు చెక్ పెట్టిన ప్రభుత్వం..  సభ్యుల నియామకంలో మాత్రం తర్జనభర్జన పడుతోంది.

  రాష్ట్ర ప్రభుత్వం బోర్డు సభ్యుల నియామకం చేసే ప్రతి సారి భారీగా సిపార్సులు వస్తుంటాయి. సభ్యత్వం కోసం తీవ్ర పోటీ ఉంటుంది. సభ్యులుగా మా వారికీ అవకాశం ఇవ్వండి అంటూ పీఠాధి పతులు., వివిధ రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రుల నుంచి సిపార్సు భారీగానే అందుతూ వస్తుంటాయి.
  వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత  వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన 50వ పాలకమండలిని నియమించింది ఏపీ ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభ్యులు ఆహ్వానితులతో కలసి 25 మందితో జంబో పాలకమండలిని ఏర్పాటు చేసింది. పాత పాలకమండలి గడువు ముగియడం.. కొత్త పాలకమండలి చైర్మన్ గా తిరిగి వైవీ సుబ్బారెడ్డిని నియమించడంతో సభ్యుల నియామకంపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో సంఖ్యను మరింత పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఒత్తిళ్ల ప్రకారం 45 నుంచి 55 వరకు సభ్యుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

  రాష్ట్ర విభజనకు ముందు వరకు 12 మంది పాలకమండలి సభ్యులు., టీటీడీ ఈవో., రెవెన్యూ ప్రినిసిపాల్ సెక్రటరీ., దేవాదాయశాఖ కమిషనర్లు ఎక్స్ ఆఫీసియో మెంబర్లుగా ఉండే వారు. రాష్ట్ర విభజన ముందు వరకు ఈ పద్దతే అమలవుతూ వచ్చింది. విభజన తరువాత చంద్రబాబు ఆ సంఖ్యను 15కు పెంచుతూ ముగ్గురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. చంద్రబాబు తరువాత సీఎం పీఠం ఎక్కిన జగన్ ఆ సంఖ్యను 25కి పెంచుతూ.. 11 మంది ప్రత్యేక ఆహ్వానితులని నియమించారు. ఇక సభ్యుల నియామకం కోసం కసరత్తు చేస్తున్న ప్రభుత్వానికి కేంద్ర మంత్రులు అమిత్ షా., నిర్మల సీతారామన్ లు., తెలంగాణ., కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సిపార్సులు వచ్చినట్లు సమాచారం. వీరే కాకుండా సీఎం జగన్ కాబినెట్ లో ఉన్న మంత్రుల బంధువులు., వైసీపీ కీలక నేతలు, సీఎం మిత్రులు, బడా పారిశ్రామిక వేత్తలు సిపార్సులు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వారి సంఖ్య దాదాపు 80మందికి చేరిందని చెప్తున్నారు. వీరిలో ఎంత ఫిల్టర్ చేసిన 60 మంది వస్తున్నారట. వారిని తొలగించడానికి సాధ్యం కానీ పరిస్థితులు కనిపిస్తున్నాయని సమాచారం. దింతో 50 నుంచి 60 మంది వరకు సభ్యుల నియామకం ఉంటుందని అంచనా. అన్ని అంశాలను పరిశీలిస్తే  టీటీడీ పాలకమండలి డబుల్ జంబో పాలకమండలిగా మారడం ఖాయమంటూన్నారు విశ్లేషకులు.
  Published by:Nagesh Paina
  First published: