టీటీడీ సంచలన నిర్ణయం... చిత్తూరు జిల్లా వాసులకు వరాలు

లోకల్ రిజర్వేషన్ తీర్మానాన్ని టీటీడీ ఏకగ్రీవంగా ఆమోదించింది.

news18-telugu
Updated: November 12, 2019, 10:42 AM IST
టీటీడీ సంచలన నిర్ణయం... చిత్తూరు జిల్లా వాసులకు వరాలు
IRCTC Tirupathi Tour: తిరుపతి టూర్ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ... విశేషాలివే (image: TTD)
  • Share this:
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా వాసులకు టీటీడీ వరాలు ప్రకటించింది. టీటీడీలో ఉద్యోగాల భర్తీలో చిత్తూరు జిల్లా వాసులకు 75 శాతం రిజర్వేషన్ క్పలించాలని వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాలకమండలిని కోరారు, ఇకపై ఉద్యోగాల భర్తీలో 75 శాతం చిత్తూరు జిల్లా వాసులకే ఇవ్వాలని నిర్ణయించింది. లోకల్ రిజర్వేషన్ తీర్మానాన్ని టీటీడీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తమ నిర్ణయానికి ప్రభుత్వ అనుమతి కోసం పంపింది. ఈ రిజర్వేషన్ టీటీడీలోని జూనియర్ అసిస్టెంట్ స్థాయి వరకు ఉద్యోగాల భర్తికి వర్తించనుంది. భూమన టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం టీటీడీ తీర్మానాన్ని ఆమోదిస్తుందో లేదో వేచి చూడాలి.
First published: November 12, 2019, 10:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading