తిరుమలలో ఉగ్రవాదులు? కొండపై కమాండోలు... జోరుగా తనిఖీలు

తిరుమల తిరుపతికి కూడా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్నారు. తిరుమలకొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు.

news18-telugu
Updated: September 12, 2019, 9:13 AM IST
తిరుమలలో ఉగ్రవాదులు? కొండపై కమాండోలు... జోరుగా తనిఖీలు
తిరుమల శ్రీవారి ఆలయం
  • Share this:
గత కొన్ని రోజులుగా తమిళనాడులో ఉగ్రవాదులు కదలికలు ఉండే అవకాశం ఉందంటూ కేంద్రం అందర్నీ హెచ్చరించింది. ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించారని, దక్షిణాదిలో ఎప్పుడైనా, ఎక్కడైనా దాడులకు తెగబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తిరుమల తిరుపతికి కూడా ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్నారు. తిరుమలకొండపై భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా తిరుమలలోకి ఉగ్రవాదులు ప్రవేశించారన్న అనుమానంతో ఆక్టోపస్ బృందం రంగంలోకి దిగింది.

మొత్తం 40 మంది కమాండోలు తిరుమలను అడుగడుగున జల్లెడ పడుతున్నారు. టెర్రరిస్టుల్ని ఎదుర్కోవడంలో కఠోర శిక్షణ పొందిన వీరు అత్యాధునిక ఆయుధాలు, టెక్నాలజీని వినియోగించి సామాన్య భక్తులకు, ప్రజలకు ఎలాంటి నష్టం లేకుండా ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో ఆరితేరినవారు. తిరుమల కొండకు ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో, టీటీడీ వినతి మేరకు ఆక్టోపస్‌ కమాండో బృందాలు రంగంలోకి దిగాయి. కొండపై అణువణువునా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నాయి.

ఉదయం, సాయంత్రం సమయాల్లో ఆలయ పరిసరాలతో పాటు తిరుమల మొత్తం కమాండోలు తిరుగుతున్నారు. బృందాలుగా విడిపోయి, అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతాన్నీ తనిఖీ చేస్తున్నారు. ఆలయం వద్ద నిరంతర నిఘా ఉంచుతున్నారు. నలుపురంగు దుస్తుల్లో ఆయుధాలు ధరించి, కాళ్లకు షూస్ లేకుండా తిరుమల మాడ వీధుల్లో కమాండోలు కొండపై తిరుగుతున్నారు.
Published by: Sulthana Begum Shaik
First published: September 12, 2019, 9:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading