టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు ?

టీడీపీ నుంచి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి వెళ్లబోతున్నారనే న్యూస్ ఏపీ రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

news18-telugu
Updated: December 4, 2019, 12:59 PM IST
టీడీపీకి మరో షాక్... వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు ?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిన అధికార వైసీపీ... ఈ క్రమంలో మొదటగా టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని తమ వైపు తీసుకురావడంలో సక్సెస్ సాధించింది. కారణం ఏదైనా... టీడీపీకి హ్యాండిచ్చి వైసీపీలోకి వచ్చేందుకు వంశీ సిద్ధమయ్యారు. ఆయన ఎప్పుడు అధికారికంగా వైసీపీ కండువా కప్పుకుంటున్నారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంటే టీడీపీకి ప్రతిపక్ష లేకుండా చేయాలనే ఆలోచనతో ఉన్న వైసీపీ... ఈ క్రమంలోనే సాధ్యమైనంత ఎక్కువమంది టీడీపీ ఎమ్మెల్యేలను ఆ పార్టీ నుంచి దూరం చేయాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలతో వైసీపీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో ఈ మేరకు చర్చలు జరుపుతున్నట్టు జిల్లా రాజకీయవర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి. జిల్లా నుంచి టీడీపీ తరపున గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాం, ఏలూరి సాంబశివరావు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి విజయం సాధించారు. వీరిలో ముగ్గురిని తమ వైపు తిప్పుకోవాలని వైసీపీ విశ్వప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కొడాలి నాని, పేర్ని నాని తొలుత ఎమ్మెల్యే గొట్టిపాటితో మంతనాలు జరిపారు.

ఇదే సమయంలో కొడాలి నాని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరికి ఫోన్‌ చేసి వైసీపీలోకి రావాలని ఆహ్వానించారని.. పార్టీలోకి వస్తే అన్ని విధాలా ప్రాధాన్యం ఉంటుందని భరోసా ఇచ్చినట్లు సమాచారం. కరణం బలరాంతో బాలినేని చర్చించి పార్టీలోకి రమ్మని ఆహ్వానించినట్లు తెలిసింది. టీడీపీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తున్న మంత్రులు మంగళవారం విజయవాడలోని మంత్రి బాలినేని నివాసంలో సమావేశమై చర్చించినట్లు సమాచారం. దీనిపై మంత్రులు సీఎం జగన్‌ను కలిసి వివరించబోతున్నట్టు తెలుస్తోంది.First published: December 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>