జగతి కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు: రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

జగతి కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: October 9, 2020, 2:35 PM IST
జగతి కేసులో ముగ్గురు ప్రముఖులు  జైలుకు: రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు
రఘురామకృష్ణంరాజు
  • Share this:
జగతి కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రఘురామకృష్ణంరాజు ఇంటిపై సీబీఐ సోదాలు జరిగాయంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేశారన్నారు. వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడపాలనుకోవడం మంచిది కాదన్నారు. వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానని తెలిపారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల విషయంలో కోర్టులు జగన్ గూబ పగలగొట్టాయన్నారు. మరోవైపు ఓట్లు కావాల్సివచ్చినప్పుడు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు కావాలని, గెలిచాక మాత్రం వారికి శిరోముండనాలు చేస్తున్నారని ఆరోపించారు. ఏడు కొండలు - ఏడుగురు రెడ్లు అన్నట్టుగా తిరుమల తయారైందని రఘురామకృష్ణంరాజు అన్నారు.

ఈనెల 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇల్లు, ఆఫీసుల్లో సీబీఐ అధికారులు సోదాలు చేసినట్టు ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ ప్రత్యేక బృందాలు... రఘురామకృష్ణంరాజుకు చెందిన ఇందు, భారత్ కంపెనీ తో సహా ఎనిమిది కంపెనీలకు చెందిన డైరెక్టర్ ల ఇళ్లలో సోదాలు చేసిందనే వార్తలు వచ్చాయి. రఘురామకృష్ణంరాజు పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా పలు ఇతర బ్యాంకుల నుంచి రూ.826 కోట్ల రుణం తీసుకుని వాటిని చెల్లించలేదనే కేసు ఉంది. రఘురామకృష్ణంరాజుకు చెందిన కంపెనీ కర్ణాటకలో పవర్ ప్లాంట్ కోసం రుణం తీసుకుని దాన్ని తమిళనాడులోని ట్యూటికోరన్‌కు తరలించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ బ్యాంకు ఫ్రాడ్ అంశంలో రఘురామకృష్ణంరాజు భార్య, కుమార్తెలతో పాటు పలువురు కంపెనీ డైరెక్టర్ల పేర్లు కూడా ఉన్నాయి.

టీటీడీ పాలకమండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీద రఘురామకృష్ణంరాజు లేఖ రాయడం పెద్ద దుమారంగా మారనుంది. దీంతోపాటు తిరుమల అంశంలో నర్సాపురం  ఎంపీ వైసీపీ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతోపాటు తాజాగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్‌ను తప్పించి, ఆ స్థానంలో మరో ఐఏఎస్ జవహర్ రెడ్డిని నియమించింది. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి ఉన్నారు. మూడు ముఖ్యమైన పదవుల్లో ఒకే సామాజికవర్గానికి చెందిన  వారు ఉండడాన్ని గమనించిన రఘురామకృష్ణంరాజు ‘ఏడు కొండలు - ఏడుగురు రెడ్లు’ అనే కామెంట్ చేశారని తెలుస్తోంది.

ఇటీవల ఎంపీ రఘురామకృష్ణం రాజు తాను తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే, అందుకు ఓ కండిషన్ విధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 21 మంది వైసీపీ ఎంపీలు (రఘురామకృష్ణంరాజుతో కలిపి 22) రాజీనామాకు సిద్ధమైతే తాను కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలంటూ వైసీపీ విప్ జారీ చేస్తే అందరితో పాటు తాను కూడా కట్టుబడి ఉంటానని రఘురామకృష్ణం రాజు స్పష్టం చేశారు. కేంద్రం అధికారంలో ఉన్న ఎన్డీయేలో వైసీపీ చేరుతోందంటూ ఆ పార్టీలో కొన్ని పేపర్లు, టీవీల్లో రాయిస్తోందని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీకి, వైసీపీకి స్నేహం సాధ్యపడదని స్పష్టం చేశారు. అసలు బీజేపీకి, వైసీపీకి ఎలా సెట్ అవుతుందని ప్రశ్నించారు. వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 9, 2020, 2:21 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading