విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత

విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్తంభాన్ని అధికారులు కూల్చివేశారు.

news18-telugu
Updated: May 23, 2020, 5:59 PM IST
విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత
విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభం కూల్చివేత
  • Share this:
విజయనగరంలో చారిత్రక మూడు లాంతర్ల స్తంభాన్ని అధికారులు కూల్చివేశారు. శుక్రవారం రాత్రి మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేశారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తాము దాన్ని కూల్చివేసినట్టు అధికారులు చెబుతున్నారు. మళ్లీ దాన్ని పునర్నిర్మిస్తామని చెబుతున్నారు. అయితే, దీనిపై రాజకీయంగా పెద్ద దుమారం రేగుతోంది. విజయనగరంలో గజపతిరాజుల చరిత్రను కనుమరుగు చేయడంలో భాగంగానే కూల్చేశారంటూ విమర్శలు వ్యక్తం చేసింది టీడీపీ. విజయనగరంలో మూడు లాంతర్ల సెంటర్‌కు చారిత్రక ప్రాధాన్యం ఉంది. 200 సంవత్సరాల చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. పూసపాటి గజపతుల కాలంలో అక్కడ మూడు లాంతర్ల స్తంభాన్ని నిర్మించారు. మూడు రహదారులు ఉన్న చోట మధ్యలో ఆ స్తంభం ఉంటుంది. దీనికి మూడు వైపులా మూడు లాంతర్లను ఏర్పాటు చేసేవారు. రాత్రి పూట ప్రజలకు రాకపోకలకు సులువుగా ఉంటుందనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేశారు. ఓ రకంగా స్ట్రీట్ లైట్ లాగా అన్నమాట.

స్వాతంత్ర్యానికి పూర్వం నుంచే ఉన్న మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చివేయడాన్ని టీడీపీ తప్పుపట్టింది. వైఎస్ జగన్ చేస్తున్న చిల్లర రాజకీయాలు చరిత్రలో ఎన్నడూ చూడలేదన్నారు. చరిత్రాత్మకమైన మూడు లాంతర్ల స్తంభాన్ని కూల్చడాన్ని ఆయన తప్పు పట్టారు. గజపతుల వారసత్వానికి గుర్తుగా ఉన్నందున వాటిని చెరిపేసేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక అశోక్ గజపతిరాజు కూడా దీన్ని ఖండించారు. ప్రభుత్వం చేసిన చర్య అనైతికమని, విజయనగరం జిల్లా ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు.

విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, అశోక్‌గజపతిరాజు తప్పుడు ప్రచారం చేస్తున్నారని సంచయిత గజపతిరాజు అన్నారు. అక్కడ ప్రస్తుతం పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అవి పూర్తయ్యాక మూడు లాంతర్ల స్తంభాన్ని ప్రతిష్టాస్తామని చెప్పారు.

First published: May 23, 2020, 3:40 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading