టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, ముగ్గురికి గాయాలు..

ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారంలో టీడీపీ, వైసీపీ మద్దతు దారులు ఘర్షణకు దిగారు. పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు.

news18-telugu
Updated: September 11, 2019, 10:38 PM IST
టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ, ముగ్గురికి గాయాలు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఇప్పటికే చలో ఆత్మకూరు అంటూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ సమయంలో టీడీపీ, వైపీపీ వర్గాలు మరోసారి ఘర్షణ పడ్డాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బయ్యారంలో టీడీపీ, వైసీపీ మద్దతు దారులు ఘర్షణకు దిగారు. పాత గొడవల నేపథ్యంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులు చేసుకున్నారు. టీడీపీ, వైసీపీ మద్దతు దారుల దాడిలో ముగ్గురు గాయపడ్డారు. వారిని కుటుంబసభ్యులు దర్శి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు