తెలంగాణ కాంగ్రెస్‌‌లో గుబులు... టీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆరా తీశారు.

news18-telugu
Updated: April 21, 2019, 9:29 AM IST
తెలంగాణ కాంగ్రెస్‌‌లో గుబులు... టీఆర్ఎస్‌లోకి మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ?
టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు
news18-telugu
Updated: April 21, 2019, 9:29 AM IST
తెలంగాణలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పార్టీ ఫిరాయింపులు ఆగడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్‌లోకి రోజురోజుకు వలసలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు... టీడీపీకి చెందిన పలువురు నేతలు గులాబీ కండువా కప్పుకున్నారు. కొందరు కాంగ్రెస్ నేతలు కమలం గూటికి చేరారు. ఇప్పుడు మిగిలున్న కొంతమంది నేతల్ని కూడా తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధికార పక్షం రెడీగా ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో మరో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కారెక్కెందుకు రెడీ అయిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో హుటాహుటిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి,సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. పార్టీ మారుతున్నారన్న వార్తలపై ఆరా తీశారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య.. టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయ్యింది. వెంటనే తమ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూసేందుకు చర్యలకు దిగింది. ముగ్గురు ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చలు జరిపింది. అయితే అలాంటిదేమిలేదని ఆ వార్తల్ని కొట్టిపారేశారు ఆ ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. తెలంగాణ ఎన్నికల్లో తమ ఆత్మస్థైర్యం దెబ్బతీసేందుకు టీఆర్ఎస్ ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అయితే వ్యక్తిగత కారణాలతో గండ్ర వెంకటరమణ రెడ్డి ఈ సమావేశానికి హాజరుకాలేకపోయారు. ఈ విషయాన్ని ఆయన ఫోన్ చేసి సీనియర్ నేతలకు వివరించారు. మరోవైపు ములుగు ఎమ్మెల్యే సీతక్క సైతం భట్టీకి ఫోన్ చేసి మాట్లాడారు. తాను కూడా పార్టీ మారుతున్నారన్న వార్తలు అవాస్తవమన్నారు. మొత్తం మీద తెలంగాణలో ఎన్నికలు ముగిసిన రాజకీయాలు మాత్రం వాడివేడిగానే సాగుతున్నాయి.
=================

First published: April 21, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...