• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • THRASH RAHUL GANDHI IN PUBLIC SAVARKAR GRANDSON COMMENTS MS

రాహుల్ గాంధీని పబ్లిక్‌లో కొట్టండి : సావర్కర్ మనువడు

రాహుల్ గాంధీని పబ్లిక్‌లో కొట్టండి : సావర్కర్ మనువడు

కాంగ్రెస్‌లో కల్లోలానికి తాత్కాలికంగా తెరపడింది. వాడీవేడిగా సాగిన సీడబ్ల్యూసీ సమావేశం, కొందరు నేతలపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఇలా ఎన్నడూ లేని విధంగా సాగిన కాంగ్రెస్ కీలక భేటీ చివరకు మరో ఆరు నెలల పాటు సోనియాగాంధీనే అధ్యక్షురాలిగా కొనసాగించాలని నిర్ణయించింది.

సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను పబ్లిక్‌లో కొట్టాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. తమ తాత సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పినట్టుగా రాహుల్ పదేపదే చెబుతున్నారని,అది నిజం కాదని అన్నారు.

  • Share this:
    హిందూ మహాసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌‌ను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ విరుచుకుపడ్డారు. సావర్కర్‌ను అవమానించిన రాహుల్‌ను పబ్లిక్‌లో కొట్టాలని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే విజ్ఞప్తి చేశారు. తమ తాత సావర్కర్ బ్రిటీష్ వారికి క్షమాపణ చెప్పినట్టుగా రాహుల్ పదేపదే చెబుతున్నారని,అది నిజం కాదని అన్నారు. జైలు నుంచి విడుదలయ్యేందుకు బ్రిటీష్ వాళ్లు పెట్టిన నిబంధనలను మాత్రమే ఆయన అంగీకరించారని అన్నారు. అంతే తప్ప క్షమాపణలు చెప్పలేదన్నారు.

    రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని,ఆయనకు ఇదో అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. గతంలో జవహర్‌లాల్ నెహ్రూ శివాజీని దోపిడీ దొంగగా విమర్శించాడని,కానీ ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడని గుర్తుచేశారు. ఇప్పుడు రాహుల్ కూడా తన ఫ్యామిలీ మిస్టెక్‌ను రిపీట్ చేస్తున్నాడని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ,మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేలకు విజ్ఞప్తి చేశారు. ఉద్దవ్ థాక్రే రాహుల్ వ్యాఖ్యలను తప్పు పట్టినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదని వ్యాఖ్యానించారు. కావాలంటే బీజేపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి,పోతుంటాయని కానీ సావర్కర్‌ను అవమానించే వ్యాఖ్యలను సహించేది లేదని అన్నారు. రాహుల్ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా వేస్తామన్నారు.

    ఇది కూడా చదవండి : 'ఐయామ్ నాట్ రాహుల్ సావర్కర్.. ఐయామ్ రాహుల్ గాంధీ'
    Published by:Srinivas Mittapalli
    First published:

    అగ్ర కథనాలు