2024లో అమరావతిలో గెలిచేందుకు జగన్ ప్లాన్ ఇదే...

2024 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి.

news18-telugu
Updated: February 26, 2020, 4:58 PM IST
2024లో అమరావతిలో గెలిచేందుకు జగన్ ప్లాన్ ఇదే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగిసి ఇంకా ఏడాది కూడా కాలేదు. అప్పుడే రాబోయే ఎన్నికల్లో ఎలా గెలవాలనే అంశంపై వైసీపీ పెద్దలు భారీ వ్యూహరచన చేస్తున్నారు. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పంచాయతీ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో రాజధాని ప్రాంతంలో కూడా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. వీటిలో గెలిచినా, ఓడినా అధికార వైసీపీకి పెద్దగా నష్టం ఉండబోదు. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికల్లో అమరావతిలో కూడా వైసీపీ జెండా మరోసారి ఎగరేసేందుకు సీఎం జగన్ ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తున్నారు.

జగన్ సర్కార్ కీలక నిర్ణయం... పేదలకు అమరావతి భూములు, AP Govt plans to distribute Amaravathi lands for poor sb
వైఎస్ జగన్


ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 25లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈక్రమంలో అమరావతిలో కూడా పేదలకు భూములు కేటాయిస్తోంది. అందుకోసం రాజధాని కోసం భూసమీకరణ చేసిన దాంట్లో నుంచి 1250 ఎకరాలను కేటాయించింది. అందులో పేదలకు ఒక్కో కుటుంబానికి సెంటు భూమి చొప్పున ఇవ్వనున్నారు. అమరావతిలో సుమారు అరలక్షకు పైగా కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. రెండు లక్షల ప్రజలకు కొత్తగా ఆశ్రయం కల్పిస్తోందని చెప్పారు. అమరావతి లోఎస్సీఎస్టి బిసి మైనారిటీలు,ఇతర కులాల్లో నిరుపేదలకు లబ్ధి జరుగుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (File)
రెండు నియోజకవర్గాల్లో అమరావతి రాజధాని ఉంది. మంగళగిరిలో తక్కువగానూ, తాడికొండ నియోజకవర్గంలో ఎక్కువగా రాజధాని ప్రాంతం ఉంది. దీంతో ప్రభుత్వం కేటాయించే భూములను కూడా ఆయా ప్రాతిపదికన కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వ్యూహం ప్రకారం రాబోయే మూడు నాలుగేళ్లలో అక్కడకు కొత్తగా 2లక్షల మంది చేరతారు. అందులో సుమారు 60 శాతం మందికి ఓట్లు ఉన్నా 1.20లక్షల ఓట్లు వైసీపీ ఖాతాలో ఆటోమేటిక్‌గా పడినట్టే.

Undavalli Sridevi,Undavalli Sridevi news,Undavalli Sridevi comments,YSRCP MLA Undavalli Sridevi,వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి,ఉండవల్లి శ్రీదేవి న్యూస్,అమరావతి రైతుల నిరసనలు,మేకప్ వేసుకుని రైతుల నిరసన,farmers protest with makeup
తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి (File)


మరోవైపు 2024 నాటికి రాష్ట్రంలో నియోజకవర్గాల సంఖ్యను పెంచడానికి అవకాశం ఉంది. అప్పుడు రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు 225కు పెరుగుతాయి. అమరావతిలో ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలను పునర్విభజించి తమకు ఓట్లు పడతాయనుకునే ప్రాంతాలను వేర్వేరు నియోజకవర్గాల్లోకి చేరిస్తే అది అధికార పార్టీకి లాభం చేకూర్చుతుంది. ఆ లెక్కన 2024లో అమరావతిలో కూడా వైసీపీ గెలవడానికి దారులు వేసుకోవచ్చు. ఇవన్నీ ఆలోచించిన తర్వాతే సీఎం జగన్ అమరావతి ప్రాంతంలో 50వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
First published: February 26, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు