అవేంజర్స్ సినిమాకెళ్లిన జగన్.. ఇది ‘ఎండ్ గేమ్’ కాదంటున్న...

ఓవైపు రాష్ట్రంలో తుఫాన్ ప్రభావం ఉంటే మరోవైపు ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి సినిమాకు వెళ్లడంపై అధికార టీడీపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తోంది.

news18-telugu
Updated: May 3, 2019, 6:47 PM IST
అవేంజర్స్ సినిమాకెళ్లిన జగన్.. ఇది ‘ఎండ్ గేమ్’ కాదంటున్న...
మహేష్ బాబుకు చెందిన AMB సినిమాస్ లో అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూసిన జగన్
  • Share this:
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబంతో కలసి అవేంజర్స్ ఎండ్ గేమ్ సినిమాకి వెళ్లడంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సినిమా స్టైల్లో స్పందించారు. ఉండవల్లిలో చంద్రబాబు మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘సినిమాకి వెళ్తే వెళ్లనివ్వడం. ఇక్కడ ఉండి చేసేదేముంది. ప్రభుత్వం అన్నీ బాగానే చేస్తుంది. అది ఎండ్ గేమ్ ఏమో.. ఇది ఎండ్ గేమ్ కాదు.’ అని అన్నారు. చంద్రబాబునాయుడు ఒక్కరే కాదు. జగన్ సినిమాకి వెళ్లడంపై అధికార టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది. ‘ఈయన గారు మన శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ వస్తే ఈయన పని ఇది కార్యకర్తలకి ఒక్క సూచన కూడా ఇచ్చాడా’ అని అమరావతి ది హిస్టారికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఫేస్ బుక్ ఖాతాలో ఓ నెటిజన్ ట్రోల్ చేశారు. మహేష్ బాబు సినిమాకి వెళ్లిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు.ఈనెల 2న వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలసి అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమా చూశారు. హైదరాబాద్ లోని ఏఎంబీ థియేటర్లో ఆయన సినిమా చూడటానికి వచ్చారు. అవెంజర్స్ చూడడానికి ఆయన వస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో, అందుకు తగిన ఏర్పాట్లు చేశారు థియేటర్ సిబ్బంది. మల్టీఫ్లెక్స్ లోని స్క్రీన్ ఫైవ్ లో అన్నీ రిక్లయినర్లు (హై ఎండ్ పుష్ బ్యాక్ సీట్లు) వుంటాయి. అది కూడా చాలా లిమిటెడ్ సీట్లు. ఈ స్క్రీన్ ను జగన్ ఫ్యామిలీ కోసం బ్లాక్ చేశారు. జగన్ వచ్చిన సందర్భంగా సాధారణ ప్రేక్షకులు వచ్చి, ఫొటోలు తీయడానికి వీలు లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. స్క్రీన్ 5 సీట్లు అన్నీ బ్లాక్ చేసినా, జగన్ అండ్ ఫ్యామిలీ కొద్దిమందే సినిమా చూశారు. జగన్ తన సన్నిహితుడైన ఓ బిల్డర్ తో కలిసి థియేటర్ కి వచ్చారు.

First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>