ఇది హిందుస్తాన్ విజయం.. ప్రజలకే అంకితం.. ప్రధాని మోదీ

మోదీ, అమిత్ షా

ఈ ఎన్నికల ఫలితాలు.. దేశంలో రాజకీయ పండితులకు ఓ పాఠం అన్నారు. ఇది మోదీ విజయం కాదని, దేశంలో అవినీతిరహితమైన పాలన కోరుకునే వారిదన్నారు.

  • Share this:
    సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఘన విజయం ప్రజలకే అంకితం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండు సీట్ల నుంచి రెండోసారి అధికారంలోకి రావడానికి కార్యకర్తలు ఎంతో కృషి చేశారన్నారు. ఈ ప్రయాణంలో బీజేపీ కార్యకర్తలు తమ సంస్కారం, వినమ్రత, ఆదర్శాలను ఎక్కడా వదిలిపెట్టలేదని చెప్పారు. ‘ఈ ఎన్నికల్లో ఎవరైనా గెలిచారంటే అది హిందుస్థాన్. ఈ విజయం ప్రజాస్వామ్య విజయం. ఇది ప్రజల విజయం. ఈ గెలుపుని ప్రజలకు అంకితం ఇస్తున్నాం. ఎన్నికల్లో గెలుపొందిన ప్రతి నేతకు అభినందనలు. వారు ఏ ప్రాంతం, ఏ పార్టీ వారు అయినా కావొచ్చు. దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం సమష్టిగా సేవ చేద్దాం.’ అని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే, నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి అభినందనలు తెలిపారు. ‘నాలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గెలిచిన వారికి కూడా అభినందనలు. బీజేపీ.. దేశం కోసం పనిచేస్తుంది. ఫెడరలిజం కోసం పనిచేస్తుంది. ఆయా రాష్ట్రాల అభివృద్ధి యాత్రలో కేంద్రం వారితో కలసి నడుస్తుంది.’ అని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు.. దేశంలో రాజకీయ పండితులకు ఓ పాఠం అన్నారు. ఇది మోదీ విజయం కాదని, దేశంలో అవినీతిరహితమైన పాలన కోరుకునే వారిదన్నారు.
    First published: