అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న స్టాలిన్.. స్ట్రాంగ్ వార్నింగ్..

Amit Shah on Hindi Diwas : హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన అమిత్ షా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.దేశ ప్రజలందరినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చే సామర్థ్యం హిందీకే ఉందని.. కాబట్టి దేశ ప్రజలంతా ఎక్కువ శాతం హిందీ మాట్లాడేందుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.

news18-telugu
Updated: September 14, 2019, 6:14 PM IST
అమిత్ షా వ్యాఖ్యలపై భగ్గుమన్న స్టాలిన్.. స్ట్రాంగ్ వార్నింగ్..
అమిత్ షా,స్టాలిన్ (File Photo)
news18-telugu
Updated: September 14, 2019, 6:14 PM IST
హిందీ దివస్‌ను పురస్కరించుకుని 'ఒకే దేశం..ఒకే భాష..' పిలుపునిచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు డీఎంకె పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'ఇది ఇండియా.. హిందియా కాదు..' అని హెచ్చరించారు. అమిత్ షా ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ గనుక వివరణ ఇవ్వకపోతే దేశంలో మరో భాషా యుద్దం తప్పదన్నారు. హోంమంత్రి వ్యాఖ్యలు భారత సమగ్రతను దెబ్బతీసేలా.. భారతీయ ప్రజలను బాధించేలా ఉన్నాయన్నారు.హిందీ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మిగతా రాష్ట్రాలను ఏకం చేసేందుకు డీఎంకే వెనుకాడబోదని స్పష్టం చేశారు.

హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన అమిత్ షా.. దేశానికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాల్సిన అవసరం ఉందన్నారు.దేశ ప్రజలందరినీ ఒక్క తాటి పైకి తీసుకొచ్చే సామర్థ్యం హిందీకే ఉందని.. కాబట్టి దేశ ప్రజలంతా ఎక్కువ శాతం హిందీ మాట్లాడేందుకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. ప్రపంచానికి మన ఉనికిని చాటేందుకు యావత్ భారతానికి ఒకే భాష ప్రాతినిధ్యం ఉండాల్సిన అవసరం ఉందన్నారు.అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా కౌంటర్ ఇచ్చారు. అన్ని భాషల కంటే మాతృభాష గొప్పదన్నారు.

అటు కర్ణాటకలోనూ అమిత్ షా వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. దక్షిణాది రాష్ట్రాలపై హిందీని రుద్దాలనుకోవడాన్ని నిరసిస్తూ పలు సంఘాలు రోడ్డెక్కాయి.దేశంలోని భిన్నత్వాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని.. ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దం అని దక్షిణాది నేతలు మండిపడుతున్నారు.

ఇది కూడా చదవండి : ఒకే దేశం.. ఒకే భాష.. గాంధీ కలలను నిజం చేయాలి : అమిత్ షా

First published: September 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...