THIRD PHASE PANCHAYAT ELECTIONS COMPLETED IN ANDHRA PRADESH AND VIZAINAGARAM TOPS POLLING PERCENTAGE TABLE HERE ARE THE DETAILS PRN
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలో భారీ పోలింగ్... ఈసారి ఆ జిల్లానే టాప్
ఏపీ మూడో పంచాయతీ ఎన్నికల్లో భారీగా పోలింగ్ నమోదు
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల్లో (AP Panchayat Elections) మూడో విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ శాతంలో విజయనగరం జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది.
ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 2,640 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడతలో 81.09 శాతం పోలింగ్ నమోదవగా.. రెండో విడతలో 81.61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మూడో విడతలో పోలింగ్ శాతం కాస్త తగ్గి 80.64శాతంగా నమోదైంది. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాలో 87.09శాతం పోలింగ్ నమోదు కాగా... అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో 69.28శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశలో 3221 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 579 పంచాయతీల ఏకగ్రీవమవగా.. మూడు పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు చేయలేదు.
జిల్లాల వారీగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి.
మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పూర్తైన వెంటనే నాలుగో విడత పంచాయతీ ఎన్నికల వివరాలను ఎస్ఈసీ విడుదల చేసింది. నాలుగో విడతలో 3,297 పంచాయతీల్లో ఎన్నికల నోటిఫికేషన్ ఉండగా.. అందులో 553 పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ప్రకటించింది. మిగిలిన 2744 పంచాయతీల్లో ఈ నెల 21న పోలింగ్ నిర్వహిస్తారు. ఈ గ్రామాల్లో 7475మంది సర్పంచ్ బరిలో ఉన్నారు. 33,435 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా అందులో 10,921 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 22,422 వార్డుల్లో పోలింగ్ పోలింగ్ జరుగుతంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.