జగన్ కేబినెట్‌లో గుంటూరు జిల్లా నుంచి మంత్రులు వీరేనా..?

వైఎస్ హయాంలో రెండుసార్లు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురికి మంత్రిపదవులు దక్కాయి. జగన్ కూడా అదే బాటలో నడుస్తారని, రాజధాని జిల్లాకు అగ్రతాంబూలం అందిస్తారనే చర్చ జరుగుతోంది.

news18-telugu
Updated: May 26, 2019, 7:01 PM IST
జగన్ కేబినెట్‌లో గుంటూరు జిల్లా నుంచి మంత్రులు వీరేనా..?
ఆళ్ల రామకృష్ణారెడ్డి, మేకతోటి సుచరిత, అంబటి రాంబాబు
  • Share this:
ఈనెల 30న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తానొక్కడినే ప్రమాణస్వీకారం చేస్తానని, వారం పది రోజుల్లో కేబినెట్ ప్రమాణస్వీకారం ఉంటుందని జగన్ స్పష్టం చేశారు. మంత్రివర్గంలో ఎవరికి చోటు దక్కుతుందనే ఆసక్తి అందరికీ నెలకొంది. ముఖ్యంగా తెలుగుదేశం కంచుకోట లాంటి గుంటూరు జిల్లాలో వైసీపీ 15 సీట్లు గెలిచింది.. దీంతో జిల్లా నుంచి ఎంతమందికి కేబినెట్ బెర్త్ దక్కుతుందనే ఆసక్తి నెలకొంది. జగన్ సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తారా? సామాజికవర్గాలకు పెద్దపీట వేస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా కనీసం రెండు నుంచి మూడు మంత్రిపదవులు జిల్లాకు దక్కుతాయని నేతలు ఆశలు పెట్టుకున్నారు.

గుంటూరు జిల్లాలో వైసీపీ 15 సీట్లు గెలిచింది. అందులో మూడు ఎస్సీ స్థానాలున్నాయి. మంగళగిరిలో నారా లోకేష్‌ను ఓడిస్తే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రిపదవి ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు. కాబట్టి, ఆళ్లకు బెర్త్ ఖాయమనే చర్చ ఉంది. చిలకలూరిపేటలో రజినీని గెలిపిస్తే ఎమ్మెల్సీ కోటాలో మంత్రిపదవి ఇస్తానని పార్టీ జిల్లా సమన్వయకర్త అయిన మర్రి రాజశేఖర్‌కు జగన్ వాగ్దానం చేశారు. ఆ లెక్కన మర్రి రాజశేఖర్ కూడా జగన్ కేబినెట్‌లో చోటు దక్కొచ్చు. ప్రత్తిపాడు నుంచి గెలిచిన మేకతోటి సుచరిత కూడా రేసులో ఉన్నారు. ఎస్సీ, మహిళా కోటాలో ఆమె ఆశలు పెట్టుకున్నారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి


వైసీపీకి గొంతుక అయిన సీనియర్ లీడర్ అంబటి రాంబాబు పరిస్థితి ఏంటనేది సస్పెన్స్. సత్తెనపల్లిలో స్పీకర్ కోడెలను ఓడించారు అంబటి రాంబాబు. ఆయన కాపు సామాజికవర్గం. బ్రాహ్మణ కోటాలో బాపట్ల నుంచి గెలిచిన కోన రఘుపతి కూడా ఆశలు పెట్టుకున్నారు. మైనారిటీ కోటాలో గుంటూరు తూర్పు నుంచి గెలిచిన ముస్తఫాకు సీటు దక్కొచ్చు. మాచర్ల నుంచి నాలుగు సార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, గురజాలలో బలమైన ప్రత్యర్థిని మట్టికరిపించిన కాసు మహేష్ రెడ్డికి దక్కుతుందా అంటే సస్పెన్స్. ఈ రెండు కుటుంబాలకు జగన్‌తో మంచి సాన్నిహిత్యం ఉంది. వైఎస్ హయాంలో రెండుసార్లు గుంటూరు జిల్లాకు చెందిన నలుగురికి మంత్రిపదవులు దక్కాయి. జగన్ కూడా అదే బాటలో నడుస్తారని, రాజధాని జిల్లాకు అగ్రతాంబూలం అందిస్తారనే చర్చ జరుగుతోంది.

కాసు మహేష్ రెడ్డి


2014 లో తెలుగుదేశం విజయం సాధించిన తరువాత చంద్రబాబు ఏర్పాటు చేసిన మంత్రి వర్గం లో కీలకమైన వ్యవసాయ శాఖను చిలకలూరిపేట నుంచి ప్రాతినిధ్యం వహించిన పత్తిపాటి పుల్లారావుకు అప్పగించారు. ప్రత్తిపాడు నుంచి గెలిచిన మాజీ ఐఏఎస్ అధికారి రావెల కిషోర్ బాబుకు సాంఘిక గిరిజన సంక్షేమశాఖను కేటాయించారు. ఆ తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో రావెలను తప్పించి వేమూరు నుంచి గెలుపొందిన నక్కా ఆనంద్‌బాబుకు కేటాయించారు.

(రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)
First published: May 26, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading