AP Election Results: జ‌గ‌న్ ‘సునామీ’కి ఈ నాలుగే కార‌ణాలు

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (File)

YS Jaganmohan Reddy | 2014 ఎన్నికల త‌రువాత ఆయ‌న అనుస‌రించిన వ్యూహాలే ఈ రోజు జ‌గ‌న్ని ఈ స్థాయిలో కూర్చోపెట్టింద‌నే చెప్పుకోవాలి.

 • Share this:
  తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర‌లో ఎప్పుడు ఏ రాజ‌కీయ పార్టీకి, ఏ రాజ‌కీయ నేత‌కు ద‌క్క‌ని విజ‌యం జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ద‌క్కింది. జ‌గ‌న్ మోహన్ రెడ్డికి ఇంత‌టి విజ‌యం ద‌క్క‌డానికి చాలా కార‌ణాలే ప‌ని చేశాయి. 2014 ఎన్నికల త‌రువాత ఆయ‌న అనుస‌రించిన వ్యూహాలే ఈ రోజు జ‌గ‌న్ని ఈ స్థాయిలో కూర్చోపెట్టింద‌నే చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎన్నిక‌ల‌కు 3 ఏళ్ల ముందు నుంచి జ‌గ‌న్ వ్య‌వ‌హారశైలి ఆయ‌నకు అత్యంత స‌న్నిహితంగా ఉన్న వారిని కూడా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. జ‌గ‌న్ గెలుపు కార‌ణాలైన ఆ అంశాలేంటో ఇప్పుడు చూద్దాం.

  త‌న వ్య‌క్తిత్వంలో మార్పు తెచ్చుకోవ‌డం:
  2014 ఎన్నిక‌లు త‌రువాత పార్టీని విడిచి వెళ్లిన నేత‌లంద‌రూ జ‌గ‌న్ వ్య‌క్తిత్వం పైనే ఫిర్యాదులు చేశారు. ‘జ‌గ‌న్ ఎవ‌రి మాట వినరు. అహంకారి. తాను చెప్పిందే వినాల‌నుకుంటారు. సీనియ‌ర్స్ ని గౌర‌వించ‌రు.’ ఇలా జ‌గ‌న్ వ్య‌క్తిత్వంపై ప‌లు విమ‌ర్శ‌లు చేస్తూ నేత‌లు ఒక్క‌ొక్కరిగా బ‌య‌ట‌కు వ‌చ్చారు. అయితే ఈ విమ‌ర్శ‌ల్లో పూర్తిగా వాస్తవం లేద‌ని చెప్ప‌లేం. కానీ వాళ్లు విమ‌ర్శ‌లు చేసిన స్థాయిలో కాద‌ని మాత్రం చెప్పొచ్చు. పార్టీలో అంద‌ర్నీ క‌లుపుకొనిపోవ‌డం, నేత‌ల అంద‌రి మాట వినడం, ముఖ్యంగా పార్టీ కేడ‌ర్ లో పూర్తి స్థాయిలో త‌న ప‌ట్ల న‌మ్మ‌కాన్ని పెంచుకోవ‌డంలో జ‌గ‌న్ స‌క్సెస్ అయ్యారు. ప్రత్య‌ర్ధులు చేసిన విమ‌ర్శ‌ల‌నే ఆయుధాలుగా మ‌లుచుకున్నారు. త‌నలో ఉన్న లోపాల‌ను ఒక్కొక్కటిగా స‌రిచేసుకుంటూ కింది స్థాయి పార్టీ నేత‌ల్లో న‌మ్మ‌కాన్నిక‌లిగించారు.

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి


  పార్టీకి వ్యూహక‌ర్త‌ను పెట్టుకోవ‌డం
  వాస్త‌వానికి తండ్రి మ‌ర‌ణం త‌రువాత అనుకోకుండా ఏపీ రాజ‌కీయ తెర‌కు ప‌రిచ‌య‌మైన జ‌గ‌న్ కీల‌క రాజ‌కీయ అంశాల్లో నిర్ణ‌యాలు తీసుకునే అనుభవం లేద‌ని చెప్పుకోవాలి. అప్ప‌టి రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో జ‌గ‌న్ వ్యూహాలు బెడిసికొట్టాయి. అతి ఆత్మ‌విశ్వాసం కూడా జ‌గ‌న్ కు గుణ‌పాఠం చెప్పింది. దీంతో పార్టీలో కీల‌క నేత అయిన విజ‌యసాయి రెడ్డి స‌ల‌హా మేర‌కు ప్ర‌శాంత్ కిషోర్ ను వైసీపీ వ్యూహక‌ర్త‌గా నియ‌మించుకున్నారు. పీకే చెప్పిన‌ట్లు న‌డుచుకున్నారు. పార్టీ హామీల నుంచి, అభ్య‌ర్థుల ఎంపిక వ‌ర‌కు అన్ని అంశాల్లో పీకే నిర్ణ‌యం మేరకే జ‌గ‌న్ అడుగులు వేశారు. అదే ఇప్పుడు పార్టీకి ఇంత‌టి విజ‌యం సాధించిపెట్టింది.

  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రశాంత్ కిశోర్


  సుదీర్ఘ పాద‌యాత్ర
  జ‌గ‌న్ చాలా ఓదార్పు యాత్రలు చేశారు. అవి అనుకున్న రీతిలో పార్టీకి ల‌బ్ధి చేకూర్చ‌లేక‌పోయాయి. ప్ర‌శాంత్ కిషోర్ పార్టీలోకి వ‌చ్చిన త‌రువాత ఆయ‌న స‌ల‌హా మేర‌కు గ‌తంలో త‌న తండ్రి రాజ‌శేఖ‌ర్ రెడ్డి చేసిన విధంగా రాష్ట్ర‌వ్యాప్తంగా పాద‌యాత్ర చేయడానికి నిర్ణ‌యం తీసుకున్నారు. ఇది జ‌గ‌న్ జీవితంలో కీల‌క మ‌లుప‌నే చెప్పుకోవాలి. దాదాపుగా జ‌గ‌న్ చేసిన 3648 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర పార్టీకి ఎంత‌గానో క‌లిసొచ్చింది. అధికార పార్టీ అవినీతిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డంలో కీల‌క పాత్ర పోషించింది.

  వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, నారా చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, YS Jagan mohan reddy, YS Jagan, TDP, Andhra Pradesh news, YSRCP, YS Rajashekar reddy, congress, Chandrababu Naidu, ap assembly elections 2019, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్, టీడీపీ, ఆంధ్రప్రదేశ్ న్యూస్, వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్, చంద్రబాబునాయుడు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019
  పాదయాత్రలో జగన్ (ఫైల్)


  పంతాలు, ప‌ట్టింపుల‌ను వ‌దిలేయ‌డం
  2014 ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ గాలి విపరీతంగా ఉంది. దీంతో బ‌ల‌మైన నేత‌లందరూ జ‌గ‌న్ పార్టీలోకి రావడానికి ప్ర‌య‌త్నాలు చేశారు. అయితే అతి ఆత్మ‌విశ్వాసంతో గ‌తంలో వాళ్ల‌తో ఉన్న వివాదాల‌తో వారిని జ‌గ‌న్ ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింది. ఆ త‌ప్పు రిపీట్ చేయ‌కుండా పార్టీలోకి వ‌చ్చిన నేత‌ల‌ను వ‌చ్చిన‌ట్లు తీసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలోకి వ‌ల‌స‌లు రావ‌డానికి విజ‌య‌సాయిరెడ్డి పాత్ర కీల‌క‌మ‌నే చెప్పుకోవాలి. వీటితోపాటు 4 ఏళ్ల‌లో పార్టీకి సంబంధించి జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యాలు అవ‌లంబించిన తీరు పార్టీకి చాలా మంచి చేసింద‌నే చెప్పుకోవాలి.

  (బాల‌కృష్ణ‌.ఎమ్, సీనియ‌ర్ క‌రస్పాండెంట్, న్యూస్18)
  First published: