మోదీ కేబినెట్‌లో వీళ్లంతా మిస్సింగ్... ఎందుకంటే...

మొత్తం 58 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో 23 మంది కేంద్రమంత్రులు. 9 మందికి స్వతంత్ర హోదాతో సహాయమంత్రులు. మిగిలిన 24మంది సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

news18-telugu
Updated: May 31, 2019, 9:46 AM IST
మోదీ కేబినెట్‌లో వీళ్లంతా మిస్సింగ్... ఎందుకంటే...
నరేంద్రమోదీ(ఫైల్ ఫోటో)
  • Share this:
బీజేపీని అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకొచ్చిన నరేంద్రమోదీ రెండోసారి ప్రధాని పదవిని చేపట్టారు. గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో మోదీతో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ ప్రధానులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ, వ్యాపార, సినీ ప్రముఖులు హాజరయ్యారు. మోదీతో పాటు కేంద్ర మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మొత్తం 58 మంది సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అందులో 23 మంది కేంద్రమంత్రులు. 9 మందికి స్వతంత్ర హోదాతో సహాయమంత్రులు. మిగిలిన 24మంది సహాయమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మోదీ రెండో దఫా మంత్రివర్గ కూర్పు సొంత పార్టీ నాయకులను సైతం ఆశ్చర్యపరిచింది. బీజేపీలో ఉండే మహా మహుల్ని సైతం మోదీ పక్కన పెట్టేశారు. 2014లో తొలిసారిగా మోద ప్రభుత్వం కొలువుదీరినప్పుడు ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్‌ ఈసారి మంత్రవర్గంలో కనిపించలేదు. వీరిద్దరూ మోదీ 2.0 ప్రభుత్వంలో ఎలాంటి పదవులు చేపట్టలేదు. అనారోగ్య కారణాలతోనే వీరిద్దరూ కేబినెట్‌కు దూరంగా ఉన్నారని పార్టీ వర్గలు చెబుతున్నాయి. అయితే వీరితో పాటు... ఎన్నికల్లో విజయం సాధించిన మేనకా గాంధీ, రాధామోహన్‌ సింగ్‌, మహేశ్‌ శర్మ, జయంత్‌ సిన్హా, అనుప్రియా పటేల్‌, జె.ఓరమ్‌, రామ్‌ కృపాల్‌, రాజ్యవర్ధన్‌ రాథోడ్‌, రాధాకృష్ణ పొన్‌, ఎస్‌.ఎస్‌. అహ్లూవాలియా, విజయ్‌ గోయల్‌లకు కూడా కేబినెట్‌లో చోటు దక్కలేదు.

మరో కీలక నేత జేపీ నడ్డా కూడా బెర్తు దక్కలేదు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మంత్రివర్గంలో చేరడంతో నడ్డాకు పార్టీ సారథ్యం అప్పగించవచ్చని అంటున్నారు. కాగా, పోటీకి దూరంగా ఉన్న సురేశ్‌ ప్రభు, ఉమా భారతి, బీరేందర్‌ సింగ్‌, ఎన్నికల్లో ఓడిపోయిన మనోజ్‌ సిన్హా, కేజీ ఆల్ఫోన్స్‌, హన్స్‌రాజ్‌ అహిర్‌లకు కేబినెట్‌లో బెర్తు దొరకలేదు.

First published: May 31, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...