భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా.. ఆ దేశ సోకాల్డ్ ప్రజాస్వామ్య ముసుగు ప్రపంచం ముందు బహిర్గతం చేసిందన్నారు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ.
జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 375,35ఏ ఆర్టికల్ రద్దుపై పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ స్పందించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో భారత ప్రభుత్వం తమ హామీని నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ఈ నిర్ణయం కాశ్మీర్లో రక్తపాతానికి దారితీస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ డేంజరస్ గేమ్ ఆడుతోందని.. ఈ విషయాన్ని తాము ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా.. ఆ దేశ సోకాల్డ్ ప్రజాస్వామ్య ముసుగు ప్రపంచం ముందు బహిర్గతం చేసిందన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాశ్మీర్ నాయకత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించబోదని అన్నారు. పాకిస్తాన్ మీడియా కూడా ఈ నిర్ణయాన్ని అక్రమం అని,అప్రజాస్వామికం అని విమర్శించింది. ఇలాంటి తరుణంలో ప్రపంచమంతా కాశ్మీరీలకు అండగా నిలబడి ప్రజాస్వామ్యం పట్ల ఉన్న నిబద్దతతను చాటుకోవాలని కోరింది.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.