క్షమాపణ చెప్పే ప్రస్తకే లేదు.. రేప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..

క్షమాపణ చెప్పే ప్రస్తకే లేదు.. రేప్ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ..

రాహుల్ గాంధీ (File Photo)

రేప్ వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలను పక్క దారి పట్టించేందుకే బీజేపీ నేతలు ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు.

 • Share this:
  దిశ అత్యాచార ఘటన తర్వాత దేశం రేప్‌లకు రాజధానిగా మారిపోయిందని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై లోక్‌సభలో ఎన్డీయే పక్షాలు భగ్గుమన్నాయి. దేశ చరిత్రలో మొదటిసారి ఓ నాయకుడు భారతీయ మహిళలు అత్యాచారానికి గురికావాల్సిందే అంటున్నాడని మండిపడ్డారు. ఇదేనా దేశానికి రాహుల్ ఇచ్చే సందేశం అంటూ ప్రశ్నించారు. రాహుల్‌ను కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. 50ఏళ్లకు చేరువవుతున్నా రాహుల్‌కి ఏం మాట్లాడాలో తెలియడం లేదన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ఇండియాలో రేప్‌లకు ఆహ్వానం లాగా ఉందన్నారు. రాహుల్ కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. మరో కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. అత్యాచారాలపై అలాంటి వ్యాఖ్యలు చేసినవారికి లోక్‌సభలో ఉండే నైతిక అర్హత లేదని రాహుల్‌ను ఉద్దేశించి అన్నారు. ప్రజలకు, మహిళలకు ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

  కాగా, డిమాండ్‌పై రాహుల్ గాంధీ స్పందించారు. తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పౌరసత్వ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనలను పక్క దారి పట్టించేందుకే బీజేపీ నేతలు ఈ నాటకం ఆడుతున్నారని ఆరోపించారు. ఉన్నావ్ ఘటన బీజేపీ పాలిత రాష్ట్రంలో జరిగిందేనని.. వారి ఎమ్మెల్యేలే నిందితులని ఆయన అన్నారు. కానీ.. మోదీ, అమిత్ షా మాత్రం దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు.
  Published by:Shravan Kumar Bommakanti
  First published:

  అగ్ర కథనాలు