ఏపీకి రాజధాని లేదా.. షాకిచ్చిన కేంద్రం..

కేంద్రం విడుదల చేసిన ఇండియా మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని లేనేలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు రాజధానిని పేర్కొన్నా.. ఏపీ రాజధాని అమరావతి పేరు మాత్రం కనిపించలేదు.

news18-telugu
Updated: November 2, 2019, 9:00 PM IST
ఏపీకి రాజధాని లేదా.. షాకిచ్చిన కేంద్రం..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత కేంద్రం భారతదేశ పొలిటికల్ మ్యాప్‌ను విడుదల చేసింది. ఇందులో 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పటి వరకు జమ్మూ కాశ్మీర్‌లో భాగమైన పీవోకేను లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపింది. అయితే, కేంద్రం విడుదల చేసిన మ్యాప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని పేరు లేకపోవడం గమనార్హం. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాజధానిని చేర్చిన కేంద్ర ప్రభుత్వం.. ఏపీ రాజధాని అమరావతిని మాత్రం చేర్చలేదు. దీంతో మ్యాప్ చూసిన తెలుగు ప్రజలు షాక్‌కు గురవతున్నారు. ఏపీ రాజధాని పేరు లేకపోవడం ఏంటని అయోమయానికి గురవుతున్నారు. వాస్తవానికి, చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీ రాజధానిగా అమరావతికి శంకుస్థాపన చేశారు. అయితే, జగన్ ప్రభుత్వం వచ్చాక అమరావతిని రాజధానిగా కొనసాగించే విషయంలో స్పష్టత లేకపోయింది.

అదీకాక.. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుంది. దీని ప్రకారమే ఏపీకి రాజధాని పేరు చేర్చలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అయితే, ప్రస్తుతం ఏపీ పాలన వ్యవస్థకు సంబంధించి అన్ని కార్యాలయాలు అమరావతికి తరలిపోయాయి. ఏపీ కేంద్రంగానే పాలన వ్యవస్థ కొనసాగుతోంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఏపీకి సంబంధించి రాజధాని పేరు లేకపోవడం ఏపీ వాసులను నిరాశకు గురి చేస్తోంది.

భారత దేశ పటం


First published: November 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>