ఏపీ కేబినెట్ కూర్పు నచ్చలేదా..? పార్టీలో అసంతృప్తి ఉందన్న మేకపాటి...

AP Cabinet : సంచలన నిర్ణయాలతో, సామాజిక సమీకరణల్ని లెక్కలోకి తీసుకొని ఏపీ కేబినెట్‌ను రూపొందించారు సీఎం జగన్. ఐతే... అది సంతృప్తి కలిగించలేదన్న వాదన ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: June 11, 2019, 12:56 PM IST
ఏపీ కేబినెట్ కూర్పు నచ్చలేదా..? పార్టీలో అసంతృప్తి ఉందన్న మేకపాటి...
ఏపీ కేబినెట్ కూర్పుపై అసంతృప్తి ఉందన్న మేకపాటి (Image : Twitter / ANI)
  • Share this:
ఏపీలో ప్రతిపక్ష టీడీపీ సైలెంట్‌గా ఉంది. కారణం... కొత్త ప్రభుత్వానికి ఓ ఆరు నెలలు టైమ్ ఇద్దామని ఆ పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు సూచించడమే. విమర్శలు చేయకపోయినా... కొత్త ప్రభుత్వం ఏం చేస్తోందో జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు. ఇదే సమయంలో... సామాజిక సమీకరణలు, పార్టీకి విధేయత, సీనియార్టీ ఇలా అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకొని మంత్రివర్గ కూర్పు చేపట్టారు సీఎం జగన్. ఐతే... మొత్తం 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే... 25 మందికి మాత్రమే మంత్రి పదవులు దక్కడంపై పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. పైకి అంతా బాగానే ఉన్నట్లు... నేతలు చెబుతున్నా... ఏదో ఒక రోజున అసంతృప్తి బుడగ పేలుతుందనీ, అప్పుడు అధినేతకు ఇబ్బందులు తప్పవని అంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు.

పార్టీలో అసంతృప్తి, కేబినెట్ కూర్పుపై వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పిన మాటలు ఆలోచనలో పడేస్తున్నాయి. కేబినెట్‌పై కొందరు ఎమ్మెల్యేలలో అసంతృప్తి ఉందని అన్నారాయన. ఐతే... అంత ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు... అందర్నీ సంతృప్తి పరచలేం కాబట్టి... ఆ మాత్రం అసంతృప్తి ఉండటం కామనే అన్నారాయన. జగన్ చేపట్టిన కేబినెట్ కూర్పును ప్రజలు స్వాగతించారనీ, మెచ్చుకుంటున్నారనీ వివరించారు.

నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్న మేకపాటి కుటుంబం నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డిని జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అంతేకాదు... ఆయనకు కీలకమైన ఐటీ శాఖను ఇచ్చారు. ఐటీ విషయంలో హైదరాబాద్‌తో పోటీ పడాలనుకుంటున్న ఏపీకి... ఈ శాఖ అత్యంత కీలకమైనది. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా... ఈ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ... తన కొడుకైన లోకేష్‌కి దీన్ని అప్పగించారు.

అసంతృప్తికి ఇదీ కారణమేనా ? : తాజా కేబినెట్ సమావేశంలో ఏపీ సీఎం జగన్... మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంపై కూడా పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు తెలిసింది. ఎవరైనా మంత్రి అవినీతికి పాల్పడినట్లు తెలిస్తే... వెంటనే బర్తరఫ్ చేస్తానని జగన్ స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అవినీతికి పాల్పడ వద్దని, కక్కుర్తి పడవద్దని చెప్పినట్లు తెలిసింది. జగన్ అంత సూటిగా చెప్పడంపై మంత్రులు ఒకింత ఇబ్బందిగా ఫీలయ్యారని సమాచారం. తమకు తెలియకుండా తమ శాఖలో పొరపాటున ఏదైనా అవినీతి జరిగితే, తమ పదవులు ఎక్కడ పోతాయోనని మంత్రులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది.

 

ఇవి కూడా చదవండి :

శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి భారీ భద్రత... రక్షణ శాఖ అదనపు చర్యలు12న లేదా 15న తెలంగాణ కేబినెట్ సమావేశం... ఏం చర్చిస్తారంటే...

కాస్త నవ్వండన్నా... మంత్రులతో సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు...

న్యూయార్క్ మాన్‌హట్టన్ భవనంపై హెలికాప్టర్ ప్రమాదం... పైలట్ మృతి
First published: June 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading