పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం ఇదేనా?
Pawan Kalyan : ఏపీలో రాజకీయ పరిణామాలు జోరుగా మారుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే ప్రతిపక్ష పార్టీలు రాజకీయ పావులు కదుపుతున్నాయి. ఏపీలో గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత టీడీపీ మళ్లీ ప్రజలకు దగ్గరయ్యేందుకు జోరుగా ప్రయత్నిస్తుంటే... పైకి సైలెంట్‌గా ఉంటూ బీజేపీ... తెరవెనుక రాజకీయం చేస్తోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కాషాయ జెండా ఎగరేయ్యాలని టార్గెట్‌గా పెట్టుకున్న బీజేపీ... ఏపీలో అందుకు ప్రత్యేక ఫార్ములా సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది.
news18-telugu
Updated: November 15, 2019, 11:30 AM IST

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక అసలు కారణం ఇదేనా?
- News18 Telugu
- Last Updated: November 15, 2019, 11:30 AM IST
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ బయల్దేరారు. ఇటీవలే ఏపీలో ఇసుక కొరతపై లాంగ్ మార్చ్ చేసి... రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్... ఢిల్లీలోని ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్నారన్నది ఆ పార్టీ వర్గాలు చెబుతున్న మాట. బట్... అసలు విషయం వేరే ఉందన్నది రాజకీయ వర్గాల నుంచీ వస్తున్న టాక్. బ్రాడ్ మైండ్‌తో చూస్తే ఓ విషయం మనకు స్పష్టమవుతుంది. ఏంటంటే... వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఇంతలోనే ప్రతిపక్షాలన్నీ మూకుమ్మడిగా విమర్శల దాడి చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన దూకుడుగా ఉన్నాయి. టీడీపీ గత వైభవం కోసం పోరాడుతుంటే... జనసేన వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉందని తెలుస్తోంది. ప్రధానంగా పవన్ కళ్యాణ్... ప్రభుత్వ విధానాలపై ఓ రేంజ్లో ఫైర్ అవ్వడానికి బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని సమాచారం.
ప్రస్తుతం ఏపీలో బీజేపీకి రాజకీయంగా అంత సీన్ లేదు. పోనీ టీడీపీతో జతకట్టే పరిస్థితి కమలదళానికి లేదు. ఇలాంటి సమయంలో... అగ్రనేతల కళ్లు పవన్ కళ్యాణ్‌పై పడినట్లు తెలిసింది. 2023 లేదా 2024 ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్‌ని కలుపుకొని... ఏపీలో శక్తిమంతమైన పార్టీగా లేదా కూటమిగా మారాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం. జనసేన, బీజేపీ పొత్తుకి టీడీపీ బయట నుంచీ మద్దతు ఇచ్చేలా ఈ వ్యూహం ఉంటుందని తెలిసింది.
ఎన్నికల నాటికి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి బరిలోకి దిగితే వైసీపీపై పైచేయి సాధించొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ వ్యూహాంలో భాగంగానే టీడీపీ, జనసేన ఒక్కటే అనే సంకేతాలు ఇప్పటి నుంచే ప్రజల్లోకి పంపేలా... టీడీపీ నేతలు పవన్‌తో కలవడం, పవన్ చేపట్టే కార్యక్రమాలకు టీడీపీ నేతలు వెళ్లడం వంటివి జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కూడా పవన్ పోరాటాలకు పరోక్ష మద్దతు ఇస్తోంది.ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్... ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఢిల్లీలో బీజేపీ పెద్దల్ని కలిసి పవన్... రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా ఆయన... బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని మోదీతో భేటీ అవుతారని తెలిసింది. ఇదంతా కమలం అగ్రనేతల వ్యూహంలో భాగమేనని ఢిల్లీ వర్గాలు తెలిపాయి. అందువల్ల పవన్ పర్యటన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు మరింత జోరందుకునే అవకాశాలున్నాయనుకోవచ్చు. ఇప్పటివరకూ అంత జోరుగా లేని బీజేపీ కూడా ఇకపై కన్నెర్ర జేయబోతోందని టాక్.
(బాలకృష్ణ, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18తెలుగు)
ఇవి కూడా చదవండి :
Diabetes : డయాబెటిస్ వేధిస్తోందా... ఈ సలాడ్ తీసుకోండి...
Cinnamon Tea : దాల్చిన చెక్క టీ తాగారా... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...
Weight Loss : త్వరగా కొవ్వు కరగాలంటే... రోజూ ఈ టీ తాగితే సరి...

రూటు మార్చిన పవన్ కల్యాణ్... మొదలైన కొత్త రాజకీయం
జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే రాపాక సంచలన వ్యాఖ్యలు...
పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఫ్రెండ్.. జనసేనకు గుడ్‌బై
పవన్ సింప్లిసిటీ.. పండగ చేసుకుంటున్న జనసైనికులు
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు షోకాజ్ అంటూ ఫేక్ న్యూస్...
సొంత పార్టీ నేత షాక్.. పవన్ కళ్యాణ్‌కు బయటి వారి మద్దతు...
(బాలకృష్ణ, సీనియర్ కరెస్పాండెంట్, న్యూస్18తెలుగు)
Pics : మేఘా ఆకాశ్ క్యూట్ ఫొటోస్
ఇవి కూడా చదవండి :
Inspiration : దేశపు మొదటి మహిళా చాకొలెట్ టేస్టర్ పూనం కార్డియా
Pics : వెల్వెట్ లెహంగాలో తళుక్కుమన్న ప్రియమణి