మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో దొంగతనం... అర్థరాత్రి చోరీ

గేట్ వద్ద ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో పరారయ్యారు.

news18-telugu
Updated: August 23, 2019, 10:40 AM IST
మాజీ స్పీకర్ కోడెల ఇంట్లో దొంగతనం... అర్థరాత్రి చోరీ
కోడెల శివప్రసాద రావు (ఫేస్‌బుక్ ఫోటో)
  • Share this:
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఇంట్లో దొంగతనం జరిగింది. సత్తెనపల్లిలోని కోడెల నివాసంలో కరెంట్ పనికి సంబంధించి రిపేర్ చేసేదుందంటూ.. రాత్రి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. గేట్ వద్ద ఉన్న వాచ్‌మెన్ అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వాచ్‌మెన్‌పై దాడి చేసి కంప్యూటర్లతో పరారయ్యారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.

మరోవైపు ఇవాళ అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపు విషయంలో పోలీసులు కోడెల ఇంటికిరానున్నారు. మరికొద్ది గంటల్లో స్థానిక పోలీసులు సోదాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన ఫర్నీచర్ మాయమైనట్లు అధికారులు కొద్దిరోజుల క్రితం గుర్తించారు. హైదరాబాద్ నుంచి రాజధాని ప్రాంతంలోకి వెలగపూడికి ఫర్నీచర్‌ను తరలిస్తుండగా.. సామాను కనిపించకుండా పోయింది. 2017లోనే ఈ వ్యవహారం జరిగితే.. తాజాగా అధికారులు గుర్తించారు. ఫర్నీచర్ మాయం కావడంపై తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో మాజీ స్పీకర్ కోడెలపై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో కోడెల ఇంట్లో దొంగతనం జరడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు