Huzurabad By Election: ఈటలకు ధీటైన అభ్యర్థి అన్వేషణలో టీఆర్ఎస్.. ఆ అధికారి పేరు ఫైనల్ చేసినట్లేనా..?

సాని పురుషోత్తంరెడ్డి, దామోదర్ రెడ్డి (ఫైల్ ఫొటోస్)

Huzurabad By Election: హుజూరాబాద్ లో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. టీఆరెస్ పార్టీ తరుఫున ఉప ఎన్నికల బరిలో దింపేందుకు ఇప్పటికే చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు ధీటై న అభ్యర్థి అన్వేషణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముద్దసాని వారసుడి పేరు పరిశీలిస్తోంది.

 • Share this:
  (పి. శ్రీనివాస్, కరీంనగర్ జిల్లా, న్యూస్18 తెలుగు) 

  రాష్ట్ర రాజకీయాల్లో , ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన మాస్ లీడర్ , ప్రజలచే టైగర్‌గా పిలువబడిన ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి , వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ( వీటీడీఏ ) వైస్ చైర్మన్ ముద్ద సాని పురుషోత్తంరెడ్డి పేరును గులాబీ బాస్ పరిశీలిస్తున్నారు. ఈ మేరకు ముద్ద సాని అయితే ఎలా ఉంటుంది అనే కోణం లో ఇంటలిజెన్స్ వర్గాలు సర్వే చేసి సీల్డ్ కవర్ సీఎంకు పంపించింది. ఉమ్మడి రాష్ట్రంలో నల్గొండలో, మహబూబ్ నగర్ లో కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహించిన పురుషోత్తం రెడ్డి దామోదర్ రెడ్డికి స్వయానా అన్న . సౌమ్యుడిగా పేరుంది . సీఎం కేసీఆర్ మబూబ్నగర్ ఎంపీగా పనిచేసినపుడు అక్కడ కలెక్టర్‌గా పని చేశారు . ఆయన రిటైర్ అయిన తరువాత సీఎం కేసీఆర్ ఏరికోరి ఎంపిక చేసి వీటీడీ ఏ వైస్ చైర్మన్‌గా నియమించారు . పురు షోత్తం రెడ్డి పేరుకు ముందు దామోదర్ రెడ్డి కుమారుడు కశ్యప్ రెడ్డి పేరుకూడ పరిశీలనకు వచ్చింది . మాజీ మంత్రి , రాష్ట్ర ఆర్థిక సంస్థ చైర్మన్ రాజేశం గౌడ్ కశ్యప్ పేరును పరిశీలించాలని కోరడం తో మొదట్లో ఆయన పేరును కూడ పరి శీలించారు .

  ఈటలను ఢీకొట్టే విషయం లో కశ్యప్ పర్సనాలిటీ కంటే పురుషోత్తం రెడ్డి మంచిపేరుకలిసివస్తుందని భావిస్తు న్నట్లు తెలిసింది . ప్రస్తుత హుజురాబాద్ పూర్వ కమలాపూర్ నియోజవర్గంలో ముద్దసాని దామోదర్ రెడ్డిది చెరగని ముద్ర , యువ తహృదయాల్లో స్థానం సంపాదించుకు న్నారు . కమలాపూర్ నియోజర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ఎన్టీఆర్ , చంద్రబాబుల హయాంలో మంత్రిగా పనిచేశారు . పార్టీ జిల్లా అధ క్షుడిగా కూడా సేవలు అందించారు . ఎన్ టీఆర్ కు వీరాభిమాని అయిన ముద్ద సాని ఎన్టీఆర్ పై నాదెండ్ల తిరుగుబాటు చేసినపుడు యువతను కదిలించి సైకిల్ యాత్ర చేయడం ద్వారా ఎన్టీఆర్ దృష్టి లో పడ్డారు . కరీంనగర్ లో చికెన్ సెంటర్ వ్యాపారం చేసుకుంటూ జీవించే దామోదర్ రెడ్డి కి ఎన్టీఆర్ పిలిచి టికెట్ ఇవ్వ డంతో దామోదర్ రెడి రాజకీయాల్లో ఎదిగారు . యువజన సర్వీసులు , వాణి జ్యశాఖ తదితర శాఖలను నిర్వహించా రు . దామోదర్ రెడ్డికి ఇప్పటికీ కమలా పూర్ లో అభిమానులు , అనుచరులు ఉన్నారు . ఆయన మరణాంతరం చాలా మంది టీఆర్ఎస్లో చేరారు .

  Read Also: హుజూరాబాద్ లో పోటీకి ఈటల జమున.. ఈటలకు కేంద్ర మంత్రి పదవి..?


  ఆయనకు మారుడు కశ్యప్ రెడ్డి మొదట్లో టీడీపీలో చురుకుగా పాల్గొన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దూరంగా ఉన్నారు .ఈటల వెంట ఉన్న ముఖ్య అనుచరుల్లో ఒకప్పటి ముద్దసాని దామోదర్ రెడ్డి అనుచరులు , అభిమానులు ఎక్కువగా ఉన్నారు . ముఖ్యంగా వీణవంక , జమ్మి కుంటలలో ఉన్నారు . ఈటలకు పోటీగా ముద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డిని బరిలో ఉంచడం ద్వారా ఒకప్పటి ముద్దసాని అనుచరులు టీఆర్ఎస్ కు రావడమే కాకుండా చురుకుగా పనిచేసే అవకాశం ఉండటతో ఈ కోణంలో కూడ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలిసింది . పురుషోత్తం రెడ్డి కి మంచి పేరు ఉండటం , రెడ్డి సామాజిక వర్గం కావడంతో కలిసి వస్తుందని , ఈట లకు ధీటుగా పోటీ ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది.
  Published by:Veera Babu
  First published: