Home /News /politics /

THE SURVEY REVEALED THAT EITALA SHOULD BE THE CHIEF MINISTERIAL CANDIDATE ON BEHALF OF THE BJP VB

Etala Rajender: సీఎం కేసీఆర్ ను ఢీకొట్టాలంటే ఈటలే కరెక్ట్.. ముఖ్యమంత్రి అభ్యర్థిగా సర్వేల్లో షాకింగ్ విషయాలు..

ఈటల రాజేందర్ (ఫైల్)

ఈటల రాజేందర్ (ఫైల్)

Etala Rajender: తెలంగాణ రాజకీయంలో రానున్నా కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం లేదంటూ చెప్పుకొస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రస్తుతం ఈటల గెలుపుతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది.

  తెలంగాణ(Telangana) రాజకీయంలో రానున్నా కొద్ది అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ (TRS) పార్టీకి ప్రత్యామ్నాయం లేదంటూ చెప్పుకొస్తున్న అధికార పార్టీ నేతలకు ప్రస్తుతం టెన్షన్ మొదలైంది. ఈ వ్యవహారం అంతా దుబ్బాక నంచే మొదలైందని చెప్పాలి. 2018లో జరిగిన సాధారణ ఎన్నికలో రెండో సారి భారీ మెజారిటీతో సీట్లను కైవసం చేసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ కు వచ్చే సాధారణ ఎన్నికలకు మాత్రం ముచ్చెమటలు తప్పేలా లేదు. తెలంగాణలో బీజేపీ లేదంటూ ప్రచారం చేసిన అధికార పార్టీ నాయకులు ప్రస్తుతం అదే పార్టీతో అధికారం కోల్పోయే పరిస్థితికి వచ్చింది. 2018 ఎన్నికలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకున్న బీజేపీ ప్రస్తుతం మూడు స్థానాల్లో ఉంది. ముగ్గురు త్రిమూర్తులు అసెంబ్లీలో అడుగుపెడుతున్నారు.

  Shocking Incident: బావ.. పత్తి చేనుకు వెళ్దాం అంటూ తన భర్తను తీసుకెళ్లింది.. కాని చివరకు ఇది ఊహించలేకపోయాడు..


  ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్మే రాజాసింగ్, దుబ్బాక బై ఎలక్షన్లో గెలిచిన రఘునందన్ రావు అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఇక ముందు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో మొదటి సారిగా బీజేపీ తరపున హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అడుగు పెట్టబోతున్నాడు. ముగ్గురుని ఆర్ఆర్ఆర్ (RRR)గా సంబోధిస్తూ కొన్ని మీమ్స్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌ ఎన్నికలతో మొదలైన ఈ ఆట తెలంగాణ మొత్తానికి అంటుకుని త్వరలోనే టీఆర్‌ఎస్‌ను ఖతం చేయడం ఖాయం అని బీజేపీ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వేవ్ ఇప్పట్లో పోదని.. టీఆర్ఎస్ ను గద్దె దించడమే తమ ధ్యేయమని అతడు తెలిపాడు. ఈటల గెలుపుతో తెలంగాణలోని బీజేపీ కార్యకర్తల్లో ఉత్సాహం పొంగిపోతోంది. త్వరలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమంటూ వాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

  Affair: అక్రమ సంబంధంపై తల్లిని ప్రశ్నించాడు.. సమాధానం రాలేదు.. దీంతో కోపంతో అతడు బెడ్ రూంకి వెళ్లి..


  ఇదంతా ఇలా ఉండగా.. బీజేపీ తెలంగాణలో దూసుకపోవడానికి కారణం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనే చెప్పాలి. అతడు మీటింగ్ లో ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడిన మాటలు ప్రజలు గమనించినట్లు తెలుస్తోంది. అయితే హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచిన ఈటల రాజేందర్ ప్రస్తుతం పవర్ ఫుల్ అభ్యర్థిగా మారారు. అధికార పార్టీ అభ్యర్థినే ఢీ కొట్టి విజయం సాధించడంతో అతడికి రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సత్తా ఉందో తెలిసిపోయింది. దీంతో బీజేపీకి అతడు ఒక ట్రంప్ కార్డుగా మారిపోయాడు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ బలోపేతానికి ఈటల నాయకత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ వాడుకోనున్నట్లు తెలుస్తోంది. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను సీఎం అభ్యర్థిగా కూడా నిలపనున్నదని సమాచారం. ప్రభుత్వం వ్యతిరేక శక్తులను, ఉద్యమకారులను, టీఆర్ఎస్ లోని అసంతృప్తి దారులను ఏకం చేసే పనులను అతడు త్వరలోనే చేపట్టనున్నట్లు సమాచారం.

  Minor: రాత్రి తండ్రి, పగలు కొడుకులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుటుంబసభ్యులు.. ఆ ఇంటి ఇల్లాలు కూడా..


  అయితే దీనిపై ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో సీఎం అభ్యర్థగా ఎవరు ఉంటే బాగుంటుందని నిర్వహించగా.. ఈటెలకు 60 శాతానికి పైగా మద్ధతు తెలిపారు. తర్వాత స్థానంలో కిషన్ రెడ్డి ఉండగా.. మూడో స్థానంలో బండి సంజయ్ ఉన్నారు. ఈటల ఇటీవల ఢిల్లీ పర్యటకు వెళ్లడంతో.. ఈ సర్వేపై బలం చేకూరింది. టీఆర్ఎస్ లో ఈటల ఉన్న సమయంలో అతడు సీఎం అభ్యర్థి అంటూ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. వాటిని తిప్పి కొట్టేందుకే ఈటలపై ఆరోపణలు చేసినట్లుకూడా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు టీఆర్ఎస్ ను ధీటుగా ఎదర్కోవాలంటే ఈటల వల్లనే సాధ్యం అవుతుందని కొంతమంది రాజకీయ నాయకుల అభిప్రాయం. మున్ముందు ఈటల నాయకత్వంలో బీజేపీ ముందుకు వెళ్తుందా.. లేదా ఏమైనా వ్యూహాలు అమలు చేస్తుందో చూడాలి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Bjp, CM KCR, Eetala rajender

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు